Rajesh Banik: రోడ్డు ప్రమాదంలో భారత క్రికెటర్ మృతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:52 PM
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్‌రౌండర్ రాజేశ్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్( India U-19 cricketer)లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్‌రౌండర్ రాజేశ్ బానిక్(Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
40 ఏళ్ల రాజేశ్ బానిక్ త్రిపురలోని ఆనందానగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అగర్తాలలోని జీబీసీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన అకాల మరణం అభిమానులను షాక్‌కు గురి చేసింది.
క్రికెట్ ప్రస్థానమిదే..
రాజేశ్ బానిక్ దేశవాళీ క్రికెట్‌లో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రాజేశ్ 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9.32 సగటుతో 1469 పరుగులు చేశారు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2002-2003 రంజీ సీజన్‌లో ఆయన త్రిపుర తరఫున అరంగేట్రం చేశారు. ఆయన భారత అండర్-19 ప్రపంచ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2000 సంవత్సరంలో జరిగిన వరల్డ్ ఛాలెంజ్‌లో భారత అండర్-15 జట్టులో ఆయనకు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు.
త్రిపుర క్రికెట్ అసోసియేషన్ సంతాపం
రాజేష్ బానిక్ మృతిపై త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రతా డే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అండర్-16 క్రికెట్ జట్టు సెలెక్టర్‌ను కోల్పోవడం చాలా దురదృష్టకరం. మేము పూర్తిగా షాక్‌లో ఉన్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన రాష్ట్రంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరు. అంతే కాకుండా, యువ ప్రతిభను గుర్తించడంలో ఆయనకు మంచి పట్టు ఉండేది. అందుకే ఆయనను అండర్-16 జట్టు సెలెక్టర్‌గా నియమించాం’ అని సుబ్రతా డే అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆసుపత్రి నుంచి శ్రేయాస్ డిశ్చార్జ్
రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి