Deepti Sharma: ప్రపంచ కప్ విజేత దీప్తి శర్మకు భారీ షాక్..
ABN , Publish Date - Nov 06 , 2025 | 09:30 PM
యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటరైన శ్వేతా సెహ్రావత్ ను యూపీ రిటైన్ చేసుకుంది. యూపీ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం సదరు యాజమాన్యం జట్టు నుంచి రిలీజ్ చేసింది.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్ 2025(World Cup 2025)లో భారత్ విశ్వవిజేతగా నిలవడంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) కీలక పాత్ర పోషించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచులో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసింది. టోర్నీ ఆసాంతం మంచి ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా దీప్తి శర్మ నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖల నుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దీప్తి శర్మకు ఓ బిగ్ షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
యూపీ వారియర్జ్ (UP Warriorz) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటరైన శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat)ను యూపీ రిటైన్ చేసుకుంది. రూ. 50 లక్షలకు శ్వేతను యూపీ రిటైన్ చేసుకుంది. యూపీ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం సదరు యాజమాన్యం జట్టు నుంచి రిలీజ్ చేసింది. యూపీ తీసుకున్న ఈ నిర్ణయంతో నవంబర్ 27న ఢిల్లీ జరగనున్న వేలంలో దీప్తి పాల్గొనుంది. డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ నుంచి దీప్తీ శర్మ యూపీ వారియర్జ్‌తో కొనసాగింది.
దీప్తిని యూపీ(UP Warriorz) ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్(Women’s Premier League) తొలి సీజన్ వేలంలో రూ.2.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించిన దీప్తీ.. యూపీ నిర్ణయంతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఈ వేలంలో దీప్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునుంది. అలిస్సా హీలీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీలక ప్లేయర్లను కూడా యూపీ వారియర్జ్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం యూపీ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే యూపీ వారియర్జ్ వద్ద నాలుగు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి దీప్తి శర్మను లేదా ఇతర స్టార్ ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
యూపీ రిలీజ్ చేసే ప్లేయర్లు వీరే..
ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, అంజలి శర్వాణి, కిరణ్ నవగిరె, జార్జియా వాల్.
ఇవి కూడా చదవండి:
Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
Deepti Sharma Meets PM Modi: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?.. దీప్తి శర్మకు ప్రధాని మోదీ ప్రశ్న