Deepti Sharma Meets PM Modi: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?.. దీప్తి శర్మకు ప్రధాని మోదీ ప్రశ్న
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:26 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పట్ల భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ అభిమానం చాటుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీతో దీప్తి మాట్లాడుతూ.. 'మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు. కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ(Deepti Sharma) ప్రధాని మోదీతో పేర్కొంది.
ఈ క్రమంలో మోదీ(Narendra Modi).. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడిగారు. ఆమె సమాధానం ఇస్తూ.. ‘నా కంటే నేను హనుమాన్‌నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’ అని దీప్తి బదులిచ్చింది. కాగా మహిళల వరల్డ్‌కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం మంచి ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా దీప్తి శర్మ(Deepti Sharma) నిలిచింది.
ఇవి కూడా చదవండి:
Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా