Share News

IND VS AUS: నాలుగో టీ 20లో భారత్ ఘన విజయం

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:32 PM

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్‌ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది.

IND VS AUS: నాలుగో టీ 20లో భారత్ ఘన విజయం
India vs Australia

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్‌ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలపడింది. 168 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్‌ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(30), మాథ్యూ షార్ట్‌(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్‌ విఫలం కావడంతో ఆసీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు మిచెల్, మాథ్యూ రూపంలో మంచి ఆరంభం దొరికింది. అయితే భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. దీంతో మిడిలార్డర్ విఫలమైంది. అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్‌ దూకుడుగా ఆడుతున్న మాథ్యూ షార్ట్‌(Matthew Short)ను ఔట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు.

India-vs-Australia-4th-T20.jpg


వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లను పడగొట్టాడు. అక్షర్ తో పాటు శివమ్‌ దూబే(Shivam Dube) రెండు వికెట్లు తీశాడు. అలానే వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ తీసి.. భారత్ విజయం కీలక పాత్ర పోషించారు. భార‌త బ్యాట‌ర్లలో శుభ్‌మన్ గిల్(Shuman Gill) 46 ప‌రుగుల‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ అతడు 120 కంటే తక్కువ స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక చివరి టీ 20 నవంబర్ 8న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. టీ 20 సిరీస్ కైవసం చేసుకోవచ్చు.

India-vs-Australia.jpg



ఈ వార్తలు కూడా చదవండి:

T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఖరారు.. ఆందోళనలో భారత్ అభిమానులు!

IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2025 | 05:56 PM