Share News

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

ABN , Publish Date - Apr 22 , 2025 | 02:54 PM

IPL 2025: టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఐపీఎల్‌ నయా ఎడిషన్‌లో అదరగొడుతున్నారు. తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటోళ్లకు యువరాజ్ సింగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్
Gill-Abhishek

శుబ్‌మన్ గిల్-అభిషేక్ శర్మ.. భారత క్రికెట్‌లో తక్కువ టైమ్‌లోనే స్టార్లుగా ఎదిగిన ఇద్దరు యువ ప్లేయర్లు. గిల్ టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వైస్ కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. అటు అభిషేక్ టీ20 టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో పడ్డాడు. ఐపీఎల్‌లోనూ వీళ్లు తమ జట్ల తరఫున సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అయితే వీళ్ల సక్సెస్ వెనుక వరల్డ్ కప్ హీరో, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు అనామకులైన వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడంలో యువీ పాత్ర ఎంతో ఉంది. అదే విషయాన్ని అతడి తండ్రి యోగ్‌రాజ్ సింగ్ రివీల్ చేశాడు. ఓ టైమ్‌లో గిల్-అభిషేక్‌కు అతడు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడని అతడు గుర్తుచేసుకున్నాడు.


స్ట్రిక్ట్ రూల్స్

గిల్-అభిషేక్‌.. ఇద్దరిదీ పంజాబే. ఆ స్టేట్ తరఫున విభిన్న ఏజ్ గ్రూప్ టోర్నమెంట్స్‌లో ఆడుతూ వెలుగులోకి వచ్చారు. అయితే ఒక్కసారి యువీ దృష్టిలో పడ్డాక వాళ్లకు తిరుగులేకుండా పోయింది. ఇద్దర్నీ సెపరేట్‌గా ట్రెయిన్ చేశాడు మాజీ ఆల్‌రౌండర్. అగ్రెసివ్ అప్రోచ్‌తో ఆడటం నేర్పిస్తూ సూపర్ స్ట్రైకర్స్‌గా తీర్చిదిద్ది భారత క్రికెట్‌కు అందించాడు. ఇదే క్రమంలో శిక్షణ సమయంలో నో గర్ల్‌ఫ్రెండ్స్‌, నో పార్టీస్ అంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవాడట. ఈ విషయాన్ని యువీ తండ్రి యోగ్‌రాజ్ పంచుకున్నాడు. రాత్రి 9 గంటలకల్లా నిద్రపోవడం, పొద్దున 5 గంటలకే మేల్కొనడం, ప్రాక్టీస్.. ఇలా క్రమశిక్షణ అలవాటు అయ్యేలా చేశాడని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు.


మాట వినకపోతే..

అభిషేక్‌ను యువరాజ్ లాక్ చేశాడని.. పార్టీలు, గర్ల్‌ఫ్రెండ్స్ అనేవి లేకుండా చేశాడని యోగ్‌రాజ్ పేర్కొన్నాడు. టైమ్‌కు పడుకోవడం, వేకువజామునే నిద్రలేవడం లాంటివి అలవాటు చేశాడని.. మాట వినకపోతే వారిపై గట్టిగా అరిచేవాడని యోగ్‌రాజ్ స్పష్టం చేశాడు. అభిషేక్‌ను పొద్దునే లేపాలంటూ అతడి తండ్రికి యువీ చెప్పేవాడని.. ఇలా ట్రెయినింగ్‌లో ప్రతి విషయం మీద చాలా శ్రద్ధ తీసుకునేవాడని వివరించాడు. ఇది చూసిన నెటిజన్స్.. యువీ శ్రమ వృథా పోలేదని.. గిల్-అభిషేక్ టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా ఎదిగారని అంటున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్, పార్టీస్ పేరుతో కెరీర్ నాశనం కాకుండా వాళ్లను కాపాడాడని.. యువీ పాజీ గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా: రాహుల్

రోహిత్‌, విరాట్‌ టాప్‌లోనే

రమేష్ పై చర్య తీసుకోవాలి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2025 | 03:03 PM