Share News

Jaiswal-Gilchrist: ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది.. తిట్టాడా? పొగిడాడా?

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:59 PM

టీమిండియా డాషింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లెజెండ్ గిల్‌క్రిస్ట్. అయితే ఇంతకీ అతడు తిట్టాడా? పొగిడాడా? అనేది అర్థం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు.

Jaiswal-Gilchrist: ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది.. తిట్టాడా? పొగిడాడా?
Yashasvi Jaiswal

టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బిగ్ చాలెంజ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ లెజెండ్ రోహిత్ శర్మతో కలసి ఓపెనింగ్ చేస్తూ వచ్చిన జైస్వాల్.. ఇప్పుడు మరో సీనియర్ కేఎల్ రాహుల్‌తో కలసి ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడు అతడిపై అదనపు బాధ్యత ఉంది. రోకో జోడీ నిష్క్రమించినందున టీమిండియా బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే నెట్స్‌లో గంటల కొద్దీ శ్రమిస్తూ బ్యాటింగ్‌ టెక్నిక్‌తో పాటు శారీరకంగా, మానసికంగా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్. అయితే అతడు తిట్టాడా? పొగిడాడో ఎవరికీ అర్థం కావడం లేదు.


అందుకే చెలరేగాడు..

ఇటీవల జరిగిన ఆసీస్ టూర్‌లో మిచెల్ స్టార్క్-యశస్వి జైస్వాల్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నువ్వు మెళ్లిగా బంతులు వేస్తున్నావంటూ స్టార్క్‌ను జైస్వాల్ రెచ్చగొట్టడం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో అతడ్ని ఆసీస్ పేసర్ ఔట్ చేయడం హైలైట్‌గా మారింది. ఇదే అంశాన్ని తాజాగా గుర్తుచేసిన గిల్‌క్రిస్ట్.. ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుందని, బీజీటీలోని తొలి టెస్ట్ జైస్వాల్‌దని, అందుకే ఆ మ్యాచ్‌లో చెలరేగాడని అన్నాడు.


ఫ్యూచర్ అతడిదే..

‘జైస్వాల్ భవిష్యత్తు‌లో బిగ్ సూపర్‌స్టార్‌గా అవతరించడం ఖాయం. అతడి బ్యాటింగ్ మెరుపుల్ని బట్టే ఎంత ప్రతిభావంతుడో అంచనా వేయొచ్చు. జైస్వాల్‌ మరింత మెరుగుపడతాడు. బీజీటీలో స్టార్క్‌కు అతడికి మధ్య మంచి పోరు జరిగింది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు జైస్వాల్‌ది. కాబట్టి చెలరేగాడు. అయితే రెండో మ్యాచ్‌లో స్టార్క్‌కు దొరికిపోయాడు. ఈ ఆటలో ఉన్న అందం అదే. ప్రతి సెషన్‌, ప్రతి ఇన్నింగ్స్, ప్రతి మ్యాచ్‌కూ ఆధిపత్యం చేతులు మారుతూ పోతుంది’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 09:03 PM