KL Rahul-Virat Kohli: కేఎల్ రాహుల్‌తో ఆడుకున్న కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..
ABN , Publish Date - Apr 28 , 2025 | 06:08 PM
DC vs RCB: కోహ్లీ వర్సెస్ రాహుల్ రైవల్రీ కంటిన్యూ అవుతూ పోతోంది. డీసీ-ఆర్సీబీ మ్యాచ్‌లోనూ ఇది మళ్లీ కనిపించింది. అయితే ఈసారి గొడవ వరకు వెళ్లిన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య టీజింగ్ కూడా చోటుచేసుకుంది.

క్రికెట్‌లో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారిపోతారు. గ్రౌండ్ దాటితే అంతా ఫ్రెండ్లీగానే ఉన్నా.. వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ అయిపోతారు. టీమిండియాకు ఆడుతూ మంచి ఫ్రెండ్స్‌గా మారిన స్టార్లు విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ మధ్య కూడా ఇలాంటి రైవల్రీనే నడుస్తోంది. ఐపీఎల్‌లో వీళ్లిద్దరి మధ్య కనిపించని శత్రుత్వం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లోనూ ఇదే కంటిన్యూ అయింది. ఇద్దరూ ఆల్మోస్ట్ గొడవ పడటం, టీజ్ చేయడం వరకూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
గిరి గీసి మరీ..
డీసీ-ఆర్సీబీ మ్యాచ్ ముగిశాక రాహుల్ దగ్గరకు వెళ్లి టీజ్ చేశాడు కోహ్లీ. కాంతార మూవీ మాదిరిగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నావ్ కదా అంటూ చేతితో చూపిస్తూ అతడ్ని ఏడిపించాడు కింగ్. దీంతో పక్కనే ఉన్న కరుణ్ నాయర్ నవ్వుల్లో మునిగిపోయాడు. రాహుల్ కూడా దాన్ని సరదాగా తీసుకోవడంతో అతడ్ని హగ్ చేసుకున్నాడు కోహ్లీ. లాస్ట్ టైమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 93 పరుగులతో సత్తా చాటిన రాహుల్.. ఇది తన అడ్డా, హోమ్ గ్రౌండ్ అంటూ కాంతార చిత్రంలో రిషబ్ శెట్టి మాదిరిగా గిరి గీసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
మనసులో పెట్టుకొనే..
కాంతార సెలబ్రేషన్ మనసులో పెట్టుకున్న కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో డీసీ ఓడటం, రాహుల్ బ్యాట్‌తో అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో అతడ్ని టీజ్ చేశాడు. సెలబ్రేట్ చేశావుగా.. ఏమైంది అంటూ ఆటాడుకున్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ-రాహుల్ మధ్య తీవ్ర వాదన కూడా జరిగినట్లు తెలుస్తోంది. విరాట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ కీపింగ్ చేస్తుండగా ఇది జరిగింది. డీసీ ఫీల్డ్ సెట్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడంతో కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడని.. దీని మీదే కేఎల్‌కు కంప్లయింట్ చేశాడని, అందుకే వాగ్వాదం జరిగిందని సమాచారం.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి