Virat Kohli On Tests: నా కెరీర్‌ను మార్చింది అతడే.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:41 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అత్యుత్తమ ఫార్మాట్ అని చెప్పాడు. అతడు గనుక లేకపోతే తన కెరీర్ ఇలా ఉండేది కాదన్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. పాత రికార్డులకు పాతర పెడుతూనే.. లెక్కనేనన్ని కొత్త రికార్డులు సృష్టించాడు. ప్రతి ఫార్మాట్‌లో తోపు బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాదాపుగా అన్ని ట్రోఫీలు అందుకున్నాడు. ఇలా కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చేసిన విరాట్.. ఇక మీదట వన్డేల్లో మాత్రమే మెరవనున్నాడు. తాజాగా టెస్ట్ రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ బ్యాటర్.. తన కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో కూడా బయటపెట్టాడు.
నా ముందు నిలబడి..
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన కెరీర్‌ను మార్చేశాడని అన్నాడు కోహ్లీ. ‘రవిశాస్త్రితో పని చేయకపోయి ఉంటే టెస్ట్ క్రికెట్‌లో ఇదంతా సాధ్యమయ్యేది కాదు. మేం కలసి విజయాలు సాధించడానికి మాకు ఉన్న స్పష్టతే కారణమని చెప్పాలి. ఏ ఆటగాడికైనా కెరీర్‌లో ఎదిగే సమయంలో మద్దతు చాలా అవసరం. అలాంటి సపోర్ట్ నాకు రవిశాస్త్రి అందించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో తాను ముందుండి విమర్శలు ఎదుర్కొనేవాడు. ఆయన లేకపోతే నా కెరీర్ ఇలా ఉండేది కాదు. నా క్రికెట్ ప్రయాణంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ కీలకపాత్ర పోషించినందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆయన మీద గౌరవం ఎప్పటికీ తగ్గదు’ అని చెబుతూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
వాళ్ల సపోర్ట్‌తోనే..
టీమిండియాకు వచ్చిన కొత్తలో తనకు భయం, బెరుకు ఉండేవని.. అయితే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తనకు అండగా నిలిచారన్నాడు కోహ్లీ. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి అలవాటు పడేలా చేశారని.. ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ వచ్చారని తెలిపాడు. వాళ్ల మద్దతుతోనే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగానని పేర్కొన్నాడు విరాట్. క్యాన్సర్ రోగుల కోసం యువీ నిర్వహిచిన ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. ఇలా తన కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్సీ వహించడం వరకు జరిగిన పలు విశేషాలను అందరితో పంచుకున్నాడు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి