Gill-Iyer: గిల్‌కు పోటీగా అయ్యర్.. మనసులోని మాట బయటపెట్టాడు!
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:31 PM
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎప్పటికప్పుడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ తాను తోపు అని నిరూపిస్తున్నాడు.

టీమిండియా కెప్టెన్సీ అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న పదవి. భారత జట్టుకు ఆడే ప్రతి ఆటగాడు ఒక్కసారైనా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాలని అనుకుంటాడు. అయితే ఏ కొందరికో మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ఈ రేసులో ఉన్న చాలా మంది సీనియర్లు కెప్టెన్సీ చేయకుండానే రిటైర్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఓ కుర్ర క్రికెటర్‌ను మాత్రం ఈ చాన్స్ చాలా త్వరగా వరించింది. అతడే శుబ్‌మన్ గిల్. టీమ్‌లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న గిల్‌ను ఇటీవలే టెస్ట్ టీమ్ సారథిగా నియమించింది బీసీసీఐ. అయితే అతడి పదవికి స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎసరు పెడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆశలు సజీవం..
శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా ఎప్పటికప్పుడు తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడీ స్టైలిష్ బ్యాటర్. కేకేఆర్‌ను గతేడాది చాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఇంత చేసినా అతడ్ని కాదని గిల్‌ను టెస్ట్ టీమ్‌కు సారథిని చేసింది బీసీసీఐ. అయ్యర్ మాత్రం సారథ్యం మీద ఆశలు వదలుకోవడం లేదు. కెప్టెన్సీ అనేది చాలా పరిణతి, బాధ్యతను తెస్తుందని అంటున్నాడు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, టీమ్ విజయం కోసం ఏదైనా చేయాలనే తపన పెంచుతుందని చెబుతున్నాడు. 22 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున తనకు ఆ ఎక్స్‌పీరియెన్స్ ఉందని అతడు పేర్కొన్నాడు.
గురిపెట్టాడు..
కెప్టెన్సీ అంటే తనకు చాలా ఇష్టమని అయ్యర్ తెలిపాడు. అతడి మాటలు విన్న నెటిజన్స్.. టీమిండియా సారథ్యం మీద శ్రేయస్‌కు గురి ఉందని అంటున్నారు. త్వరలో జరిగే టెస్ట్ సిరీస్‌ల్లో ఒకవేళ భారత్ గనుక విఫలమైతే గిల్‌ను తీసేసి అయ్యర్‌కు సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాల్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అయితే అందుకు అతడు తొలుత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొన్నాళ్ల పాటు వరుసగా స్టన్నింగ్స్ నాక్స్ ఆడుతూ పోతే బీసీసీఐకి కూడా అతడిపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం అయ్యర్ అనవసరంగా రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. గిల్‌తో పెట్టుకోవడం వల్ల వచ్చేదేమీ లేదని.. ఈ క్రమంలో బ్యాటింగ్‌లో ఫెయిలైతే అతడి స్థానానికి ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి