Shivam Dube: శివం దూబె గొప్ప మనసు.. యువ అథ్లెట్ల కోసం ఏకంగా..
ABN , Publish Date - Apr 22 , 2025 | 08:00 PM
Today IPL Match: చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె మంచి మనసు చాటుకున్నాడు. యువ అథ్లెట్లకు అతడు భారీ సాయం అందించాడు. ఇంతకీ దూబె ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

ఏ వ్యక్తి అయినా ఎదగడం ముఖ్యమే. అదే సమయంలో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్నాక ఇతరులకు చేయూతను అందించడం, అండగా ఉండటం, మిగిలిన వారి ఎదుగుదలకు కృషి చేయడం కూడా కీలకమే. ఇప్పుడు అలాంటి ఓ పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె. తమిళనాడులోని పలువురు ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులకు సపోర్ట్‌గా ఉంటానంటూ ముందుకొచ్చాడతను. ఇంతకీ దూబె చేసిన ఆ గొప్ప పని ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
వాళ్లకు అండగా..
ప్రతిభ కలిగిన 10 మంది యువ అథ్లెట్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు దూబె. ఒక్కొక్కరికి రూ.70 వేల చొప్పున ఆ పది మంది క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించాడు. తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎన్‌ఎస్‌జేఏ) మంగళవారం నాడు నిర్వహించిన అవార్డ్స్ అండ్ స్కాలర్‌షిప్స్ కార్యక్రమంలో ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పాల్గొన్నాడు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన దూబె.. యువ క్రీడాకారులను మెచ్చుకున్నాడు. వాళ్లకు టీఎన్‌ఎస్‌జేఏ రూ.30 చొప్పున స్కాలర్‌షిప్ అందించగా.. దూబె అదనంగా మరో రూ.70 వేలు ప్రకటించాడు. కాగా, స్కాలర్‌షిప్స్ అందుకున్న వారి జాబితాలో పీబీ అభినంద్ (టేబుల్ టెన్నిస్), కేఎస్ వెన్సియా శ్రీ (ఆర్చర్), ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్), షమీనా రియాజ్ (స్క్వాష్) ఉన్నారు. వీళ్లతో పాటు ఎస్ నందన (క్రికెట్), కమలి పీ (సర్ఫింగ్), ఆర్ అభినయ (అథ్లెటిక్స్), ఆర్సీ జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్), ఏ తక్షాంత్ (చెస్), జయంత్ ఆర్కే (క్రికెట్) కూడా లిస్ట్‌లో ఉన్నారు.
ఇవీ చదవండి:
రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి