Share News

Dewald Brevis: సీఎస్‌కే స్టార్ క్రేజీ రికార్డ్.. డెబ్యూ మ్యాచ్‌లో రేర్ ఫీట్!

ABN , Publish Date - Jun 28 , 2025 | 09:18 PM

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. ఎవరా స్టార్.. అతడు అందుకున్న అరుదైన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..

Dewald Brevis: సీఎస్‌కే స్టార్ క్రేజీ రికార్డ్.. డెబ్యూ మ్యాచ్‌లో రేర్ ఫీట్!
Dewald Brevis

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా చెలరేగి ఆడుతోంది. ఒకదశలో 181 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ప్రొటీస్. టోనీ డీ జోర్జీ, వియన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్ లాంటి స్టార్ బ్యాటర్లు అంతా వెనుదిరిగారు. దీంతో జింబాబ్వే చేతుల్లో సఫారీలు పరువు పోగొట్టుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ దశలో క్రీజులోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ డెవాల్డ్ బ్రేవిస్ (41 బంతుల్లో 51) దుమ్మురేపాడు. సెంచరీ హీరో లువాన్ డీ ప్రిటోరియస్ (160 బంతుల్లో 153)తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు బ్రేవిస్.


స్కోరు బోర్డు పరుగులు..

బౌండరీలు, సిక్సులతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు డెవాల్డ్ బ్రేవిస్. టెస్టులను టీ20లు మార్చేశాడు. ఉన్నది కాసేపే అయినా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు, 4 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను చెడగొట్టాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో ఫిఫ్టీ రన్స్ మార్క్‌ను అందుకున్నాడు బ్రేవిస్. తద్వారా అరంగేట్రంలో అత్యధిక వేగంగా అర్ధ శతకం బాదిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రేవిస్ ఔట్ అయిన తర్వాత ప్రిటోరియస్ చెలరేగిపోయాడు. భారీ శతకంలో సౌతాఫ్రికాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. కార్బిన్ బాష్ (124 బంతుల్లో 100) కూడా విధ్వంసక ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 418 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది ప్రొటీస్. క్వెనా మఫాకా (9 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.


ఇవీ చదవండి:

డేంజరస్ సెలబ్రేషన్.. పంత్‌ పరిస్థితేంటి..

కోచ్‌తో భారత స్టార్ల కొట్లాట

రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 09:20 PM