Rohit Sharma: వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం.. నిజం బయటపెట్టిన రోహిత్!
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:02 PM
జూన్ 29.. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.

జూన్ 29, 2024.. ఈ తేదీ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ రోజునే టీ20 వరల్డ్ కప్-2024ను గెలుచుకుంది టీమిండియా. సరిగ్గా ఏడాది కింద జరిగిన ఫైనల్ సమరంలో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టికరిపించింది రోహిత్ సేన. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణించడంతో అద్భుతమైన విజయం అందుకుంది. అయితే మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్షణం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీసుకున్న బ్రేక్ అనే చెప్పాలి. దీనిపై తాజాగా స్పందించాడు భారత వన్డే సారథి రోహిత్ శర్మ. పంత్ నాటకం వెనుక అసలు నిజం ఏంటో అతడు బయటపెట్టాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏం అన్నాడంటే..
బుర్ర వాడి..
‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో అప్పటికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. అప్పుడే చిన్న విరామం దొరికింది. పంత్ తన బుర్రను వాడి కాసేపు మ్యాచ్‌ను ఆపేశాడు. మోకాలి గాయం ఇబ్బంది పెడుతుండటంతో ట్రీట్‌మెంట్ తీసుకొని ఆడాడు. దీని వల్ల మ్యాచ్ కాస్త నెమ్మదించింది. అప్పటికి ఊపు మీదున్న ప్రొటీస్ బ్యాటర్ల రిథమ్ దెబ్బతింది. క్లాసెన్ గేమ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశాడు. మ్యాచ్ షురూ అయ్యాక అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విక్టరీ కొట్టాం. అయితే పంత్ చేసిన పని వల్లే గెలిచామని అనడం లేదు. కానీ అతడు బుర్ర వాడటం జట్టుకు చాలా మంచి చేసింది’ అని రోహిత్ బయటపెట్టాడు. మ్యాచ్‌ను స్లో చేయాలనే ఉద్దేశంతో కావాలనే పంత్ గాయం పేరుతో నాటకం ఆడాడని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ బ్రేక్ వల్ల మూమెంటమ్ మొత్తం సౌతాఫ్రికా నుంచి టీమిండియా వైపు తిరిగిందన్నాడు.
ఇవీ చదవండి:
ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి