Share News

Rishabh Pant New Record: రోహిత్ రికార్డుకు పంత్ ఎసరు.. బ్రేక్ చేయడం ఖాయం!

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:44 PM

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ క్రేజీ రికార్డ్ మీద కన్నేశాడు. లార్డ్స్ టెస్ట్‌లో దాన్ని అధిగమించాలని చూస్తున్నాడు. మరి.. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant New Record: రోహిత్ రికార్డుకు పంత్ ఎసరు.. బ్రేక్ చేయడం ఖాయం!
Rishabh Pant

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది. వరుసగా సూపర్బ్ నాక్స్‌ ఆడుతున్నాడీ పించ్ హిట్టర్. తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన పంత్.. ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో కీపింగ్ చేస్తూ గాయపడిన పంత్.. ఆ తర్వాత ఇంజ్యురీని లెక్కచేయకుండా బ్యాటింగ్‌కు దిగాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్.. 112 బంతుల్లో 74 పరుగులు చేసి ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్ (100)తో కలసి నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించాడు. అలాంటోడు ఇప్పుడో అరుదైన రికార్డుపై కన్నేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

pant.jpg


చెరిపేయడం ఖాయం..

భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు పెట్టాడు రిషబ్ పంత్. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రోహిత్ టాప్‌లో ఉన్నాడు. 69 ఇన్నింగ్స్‌ల్లో 2716 పరుగులు చేశాడు హిట్‌మ్యాన్. అయితే పంత్ వల్ల ఇప్పుడీ రికార్డు ప్రమాదంలో పడింది. డబ్ల్యూటీసీలో 65 ఇన్నింగ్స్‌లో కలిపి 2668 పరుగులు చేశాడు రిషబ్. రోహిత్ స్కోరుకు అతడు మరో 48 పరుగుల దూరంలో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఎలాగూ బ్యాటింగ్‌కు దిగుతాడు. అతడు ఇప్పుడు ఉన్న ఫామ్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రోహిత్ రికార్డును అతడు చెరిపేయడం కూడా పక్కా అనే చెప్పాలి. కాగా, గాయంతో బాధపడుతున్న పంత్ తర్వాతి మ్యాచులకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ అతడు ఆడకపోతే మరో వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను రీప్లేస్ చేసే చాన్సులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ రూపంలో మరో కీపర్ కూడా టీమ్‌లో ఉన్నాడు.

rishabh.jpg


ఇవీ చదవండి:

ఒక్క ఓవర్‌కే భయపడతారా?

మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్!

రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:47 PM