Rishabh Pant IPL 2025: పదే పదే దొరికిపోతున్న పంత్.. కావాలనే చేస్తున్నాడా..
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:00 PM
Today IPL Match: లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలిపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పంత్ చేస్తున్న తప్పు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

లక్నో సూపర్ జియాంట్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న పంత్ సేనకు ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో భంగపాటు ఎదురైంది. డీసీతో ఏకనా స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పాలైంది ఎల్‌ఎస్‌జీ. అయితే 9 మ్యాచుల్లో 10 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఆ టీమ్‌కు ఓటమి కంటే కూడా కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫెయిల్యూరే తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 106 పరుగులు చేసిన పంత్ బ్యాట్ నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అతడి వైఫల్యం టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. దీనిపై సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా స్పందించాడు. పుజారా ఏమన్నాడంటే..
అతడేమీ ధోని కాదు..
లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని పంత్ కాపీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పుజారా అన్నాడు. మాహీ మాదిరిగా చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌లు ఫినిష్ చేయాలని చూస్తున్నాడని.. కానీ ఇది అతడికి చేటు చేస్తోందన్నాడు పుజారా. తనది కాని నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి హిట్టింగ్ చేయాలా, స్ట్రయిక్ రొటేషన్ చేయాలో క్లారిటీ లేక బౌలర్లకు అడ్డంగా దొరికిపోతున్నాడని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో లాస్ట్‌లో రావాలి, ఫినిషింగ్ చేయాలనే ఆలోచన వర్కౌట్ కాట్లేదని.. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావట్లేదని పుజారా పేర్కొన్నాడు. ధోనీలా మ్యాచ్‌లు ముగించాలనే ఐడియా మంచిదేనని.. కానీ ఆ లెవల్‌లో పంత్ ఆట లేదన్నాడు. రిషబ్ కాస్త పైన బ్యాటింగ్ చేయాలని.. 6 నుంచి 15 ఓవర్ల మధ్య ఆడటం మీద అతడు ఫోకస్ చేయాలని పుజారా సూచించాడు. తాను ఫినిషర్ కాదనే నిజాన్ని గ్రహించి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకుంటే అతడితో పాటు టీమ్‌కూ మంచిదని సజెషన్ ఇచ్చాడు.
ఇవీ చదవండి:
చేతికి నల్లరిబ్బన్లతో బరిలోకి..
పెళ్లి కాని మిశ్రా భార్యను వేధించాడట
బుమ్రా మంధానకు విజ్డెన్ అవార్డులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి