RCB vs PBKS Toss: చిన్నస్వామిలో ఆగని వాన.. కనీసం 5 ఓవర్లయినా..
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:23 PM
IPL 2025: పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఇంకా మొదలవలేదు. వాన వల్ల మ్యాచ్ డిలే అయింది. వర్షం కారణంగా టాస్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్.. ఈ ఐపీఎల్‌లో అదరగొడుతున్న జట్లు. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో హవా నడిపిస్తున్న ఈ టీమ్స్ మధ్య ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వరుణుడి కారణంగా మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదు. 7.30 గంటలకే మ్యాచ్ మొదలవ్వాల్సింది. కానీ భారీ వర్షం కారణంగా టాస్ కూడా వాయిదా పడింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా.. లేదా.. వరుణుడు కరుణిస్తాడా.. అని అభిమానులు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. అసలు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి.. ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయినా ఎన్ని ఓవర్లు సాధ్యం అవుతాయి.. అనేది ఇప్పుడు చూద్దాం..
వాన ఆగకపోతే పరిస్థితేంటి..
చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో జోరుగా వాన కురుస్తోంది. దీంతో పిచ్‌పై కవర్లను అలాగే కప్పి ఉంచారు. వాన ఎప్పుడు ఆగుతుంది.. అనేది క్లారిటీ లేదు. అరగంట కింద ఆగినట్లే కనిపించినా.. తిరిగి జోరందుకున్నాడు వరుణుడు. ఒకవేళ ఎడతెరపి లేని వాన వల్ల మ్యాచ్ గనుక రద్దు అయితే రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అయితే దానికి ముందు రాత్రి 10 గంటల 56 నిమిషాలకు మరోసారి గ్రౌండ్‌ను పరిశీలిస్తారు అంపైర్లు. ఆ టైమ్‌కు వాన ఆగి మ్యాచ్ సాధ్యమేనని భావిస్తే.. 5 ఓవర్ల చొప్పున ఆట నిర్వహిస్తారు. సో, దీనికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఈ లోపు వర్షం ఆగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
సంజూ-ద్రవిడ్ కొట్లాట.. నిజమెంత
సీఎస్‌కేలోకి డివిలియర్స్ వారసుడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి