Share News

RCB vs DC Playing 11: కోహ్లీ వర్సెస్ అక్షర్.. ప్లేయింగ్ 11 చూస్తే దడ పుట్టాల్సిందే

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:10 PM

Virat Kohli vs Axar Patel: టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ-అక్షర్ పటేల్ మధ్య యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వీళ్లిద్దరూ తమ తమ జట్లతో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. అలాగే ఇద్దరి మధ్య కూడా బ్యాటిల్ జరగనుంది.

RCB vs DC Playing 11: కోహ్లీ వర్సెస్ అక్షర్.. ప్లేయింగ్ 11 చూస్తే దడ పుట్టాల్సిందే
RCB vs DC Playing 11

ఐపీఎల్‌లో మరో మహా సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఓటమి ముచ్చటే లేకుండా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ ఫైట్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో ఇరు జట్లు బలమైన ప్లేయింగ్ 11తో వెళ్లడం తథ్యంగా కనిపిస్తోంది. రెండు వైపులా భారీ హిట్టర్లు ఉండటంతో ఇవాళ పరుగుల వర్షం కురవడం ఖాయం. మరి.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


పక్కా రిపీట్..

హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపుగా అదే టీమ్‌ను రిపీట్ చేసే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే.. డుప్లెసిస్, మెక్‌గర్క్ ఓపెనర్లుగా వస్తారు. పోరెల్, స్టబ్స్ వరుసగా వన్ డౌన్, సెకండ్ డౌన్‌లో దిగుతారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటాడు. అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ ఫినిషింగ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. పేసర్లుగా స్టార్క్, ముఖేష్ ఆడతారు. ముఖేష్ భారీగా రన్స్ ఇస్తున్నందున నటరాజన్‌ను రీప్లేస్ చేయొచ్చు.


నో చేంజెస్

బెంగళూరు కూడా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ, సాల్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం పక్కా. ఆ తర్వాత కెప్టెన్ పాటిదార్, లివింగ్‌స్టన్ బ్యాటింగ్‌కు వస్తారు. థర్డ్ డౌన్‌లో జితేష్ ఆడటం ఖాయం. డేవిడ్, కృనాల్ ఫినిషింగ్ బాధ్యతలు పంచుకుంటారు. హేజల్‌వుడ్, భువనేశ్వర్ పేస్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు. వీళ్లకు తోడుగా యష్ దయాల్ ఎలాగూ టీమ్‌లో ఉంటాడు.

ప్లేయింగ్ ఎలెవన్

డీసీ (అంచనా): ఫాఫ్ డుప్లెసిస్, జేకర్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్/టీ నటరాజన్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: మోహిత్ శర్మ.

ఆర్సీబీ (అంచనా): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, యష్ దయాల్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: రసిఖ్ సలాం/సుయాష్ శర్మ.


ఇవీ చదవండి:

ఆర్సీబీ వర్సెస్ డీసీ.. అడ్డగిస్తారా..

ఒక్క చాన్స్ అంటున్న కోహ్లీ

కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 04:16 PM