Share News

RCB vs DC Prediction: ఆర్సీబీ వర్సెస్ డీసీ.. అడ్డగిస్తారా.. అడ్డం పడతారా

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:26 PM

Rajat Patidar vs Axar Patel: ఐపీఎల్-2025లో ఇవాళ నువ్వా-నేనా.. అనే రేంజ్‌లో ఫైట్ జరగనుంది. ఇద్దరు కొదమసింహాల మధ్య కొట్లాటకు అంతా రెడీ అయింది. అటు రజత్ జట్టు.. ఇటు అక్షర్ టీమ్.. ఢీ అంటే ఢీ అంటూ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

RCB vs DC Prediction: ఆర్సీబీ వర్సెస్ డీసీ.. అడ్డగిస్తారా.. అడ్డం పడతారా
RCB vs DC

ఒక్క ఓటమి కూడా లేకుండా బుల్డోజర్‌లా దూసుకెళ్తున్న జట్టుకు.. తొలి ట్రోఫీ కోసం వేగంగా పరుగులు తీస్తున్న మరో జట్టుకు మధ్య ఇవాళ సమరం జరగనుంది. ఐపీఎల్-2025లో తొలిసారి తలపడబోతున్నాయి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్. అటు డీసీ ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచుల్లో విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానంలో ఉంది. అటు ఆర్సీబీ 4 మ్యాచుల్లో మూడింట నెగ్గి 3వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న అక్షర్ సేనను.. విరాట్ టీమ్ అడ్డగిస్తుందా.. లేదా ఆ జట్టు జోరు ముందు బెంగళూరు అడ్డం పడుతుందా అనేది ఇప్పుడు చూద్దాం..


బలాలు

ఆర్సీబీ: ఈ జట్టు ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్, కీపర్ జితేష్ శర్మ, లివింగ్‌స్టన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో హేజల్‌వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ రాణిస్తున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కీలక టైమ్‌లో బ్రేక్‌త్రూలు అందిస్తూ టీమ్‌కు వెన్నెముకగా మారాడు.

డీసీ: ఈ టీమ్‌కు బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంగ్త్. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ మంచి టచ్‌లో ఉన్నారు. డుప్లెసిస్, మెక్‌గర్క్ కూడా ఫామ్‌లో కనిపిస్తున్నారు. సన్‌రైజర్స్‌పై డుప్లెసిస్ 27 బంతుల్లో 50 రన్స్‌తో వార్‌ను వన్‌సైడ్ చేసేశాడు. బౌలింగ్‌లో కుల్దీప్, అక్షర్‌, విప్రజ్ నిగమ్‌తో పాటు సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరుగుతుండటం డీసీకి బిగ్ ప్లస్.


బలహీనతలు

ఆర్సీబీ: బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ టచ్ కోల్పోవడం కొంత మైనస్‌గా మారింది. మిడిలార్డర్‌లో పాటిదార్ ఔట్ అయితే భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. లివింగ్‌స్టన్ నిలకడగా పరుగులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో భువీ పరుగులు కట్టడి చేస్తే ఆర్సీబీకి తిరుగుండదు. అందరూ వికెట్లు తీస్తున్నారు కాబట్టి రన్స్ ఇవ్వకుండా అడ్డుకోవడం కీలకంగా మారనుంది.

డీసీ: పేస్ బౌలింగ్‌లో స్టార్క్ ఫెయిలైతే ఇతర బౌలర్ల మీద ప్రెజర్ పడుతుంది. చిన్నస్వామి లాంటి చిన్న బౌండరీ ఉన్న స్టేడియంలో డీసీ పేసర్లకు రియల్ చాలెంజ్ ఎదురవనుంది. బ్యాటింగ్‌లో మెక్‌గర్క్, స్టబ్స్ రాణిస్తున్నా నిలకడగా పరుగులు చేయడం మీదే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.


హెడ్ టు హెడ్

ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 19 సార్లు ఆర్సీబీ, 11 సార్లు డీసీ నెగ్గాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

ఇరు జట్లు బలంగా ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్నాయి. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, సింగిల్ హ్యాండ్‌తో రిజల్ట్‌ను మార్చేసే కోహ్లీ లాంటి బ్యాటర్ ఉన్నందున ఇవాళ్టి పోరులో ఆర్సీబీ గెలవడం ఖాయం.


ఇవీ చదవండి:

ఒక్క చాన్స్ అంటున్న కోహ్లీ

కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 03:26 PM