Samson-Dravid: సంజూ శాంసన్‌తో కొట్లాట.. తేల్చిపారేసిన ద్రవిడ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:13 PM
IPL 2025: సంజూ శాంసన్, రాహుల్ ద్రవిడ్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ద్రవిడ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..

ఐపీఎల్-2025లో ఆటతో పాటు ఇతర విషయాలూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్లేయింగ్ ఎలెవన్స్ దగ్గర నుంచి కెప్టెన్స్ డెసిషన్స్ వరకు చాలా విషయాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్‌ల మధ్య విభేదాలు తలెత్తినట్లు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. సూపర్ ఓవర్ రిజల్టే దీనికి మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. రాజస్థాన్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీసీ నెగ్గింది. అయితే ద్రవిడ్-సంజూ విభేదాలు ఢిల్లీకి ప్లస్ అయ్యాయని.. వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
సంజూకు చెప్పాకే..
ఇలాంటి వార్తలు అసలు ఎవరు పుట్టిస్తున్నారో, ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు ద్రవిడ్. సంజూ శాంసన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశాడు రాజస్థాన్ కోచ్. టీమ్ తీసుకునే ప్రతి చర్చ, నిర్ణయంలోనూ సంజూ పాత్ర ఉంటుందని కుండబద్దలు కొట్టాడు ద్రవిడ్. గెలిచినప్పుడు ఎవరూ ఏదీ పట్టించుకోరని, అదే ఓడితే మాత్రం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. ఇలాంటి నిరాధార వార్తల్ని పట్టించుకోకపోవద్దన్నాడు ద్రవిడ్. కాగా, డీసీతో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టైమ్‌లో డగౌట్‌కు దూరంగా ఉన్నాడు సంజూ. దీంతో అతడ్ని దూరం పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతడ్ని టీమ్ మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదనే కామెంట్స్ వినిపించాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు ద్రవిడ్.
ఇవీ చదవండి:
సీఎస్‌కేలోకి డివిలియర్స్ వారసుడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి