PBKS vs RCB Prediction: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:05 PM
Today IPL Match: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు మొదలైపోయింది. పాయింట్స్ టేబుల్‌లో హవా నడిపిస్తున్న పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఎవరు టాస్ నెగ్గారు అనేది ఇప్పుడు చూద్దాం..

పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసే మరో మ్యాచ్ మొదలైపోయింది. తాడోపేడో తేల్చుకునేందుకు బరిలోకి దిగాయి పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్లేయింగ్ 11లో చేంజెస్ ఇవే..
కీలక మ్యాచ్ కావడంతో బెంగళూరు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 కీలక మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్ స్థానంలో రొమారియో షెఫర్డ్‌ను రీప్లేస్ చేసింది ఆర్సీబీ. మిగతా వారంతా లాస్ట్ మ్యాచ్‌లో ఆడినవారే. పడిక్కల్, రసిఖ్ దార్, భండగే, బేతెల్, స్వప్నిల్‌లో ఒకర్ని ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. అటు పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అయ్యర్ సేన ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఎవర్ని ఎంచుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్
పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..
కేకేఆర్ చెంతకు అభిషేక్ నాయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి