Krunal Pandya: పంజాబ్‌కు పోయిస్తున్న పాండ్యా.. ఏం పట్టావ్ భయ్యా క్యాచ్
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:17 PM
IPL 2025: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను భయపెడుతోంది ఆర్సీబీ. స్టన్నింగ్ బౌలింగ్‌తో పరుగులు చేయాలంటే వణికిలా చేస్తున్నారు బెంగళూరు బౌలర్లు. రన్స్ సంగతి దేవుడెరుగు వికెట్లు కాపాడుకోవడానికి చెమటలు చిందిస్తున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు.

ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. మహారాజా యదవింద్ర సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు ఆరంభంలో అదరగొట్టింది. కానీ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా రాకతో అంతా మారిపోయింది. ఒకదశలో 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులతో సాలిడ్‌గా ఉన్న పంజాబ్.. కృనాల్ దెబ్బకు 14 ఓవర్లకు 114 పరుగులకు 6 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. 2 కీలక వికెట్లు తీసిన కృనాల్.. ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అతడు పట్టిన క్యాచ్ అయితే మ్యాచ్‌కు స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి.
వాటే ఫోకస్..
జోరు మీదున్న ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభుసిమ్రన్ సింగ్ (33)ను 7 బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) ఇచ్చిన క్యాచ్‌ను ఊహకందని రీతిలో అందుకొని పంజాబ్ వెన్ను విరిచాడు. రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అయ్యర్ స్టరెయిట్ బౌండరీ దిశగా కొట్టిన బంతిని లాంగాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మరీ అద్భుతంగా ఒడిసిపట్టాడు కృనాల్. మెరుపు వేగంతో దూసుకురావడం, బంతిపై ఆఖరి క్షణం వరకు ఫోకస్ చేయడం, క్యాచ్ అందుకున్నాక డైవ్ వేసినా బంతిపై పట్టు జారకుండా చూసుకోవవడం హైలైట్ అనే చెప్పాలి. ఈ వికెట్ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ భారీ స్కోరు చేసే చాన్స్ మిస్ చేసుకుంది. ఇప్పుడా టీమ్ 17 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులతో ఉంది.
ఇవీ చదవండి:
ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్
పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..
కేకేఆర్ చెంతకు అభిషేక్ నాయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి