PBKS vs RCB Target: ఆర్సీబీ ముందు టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా..
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:34 PM
Today IPL Match: పంజాబ్ కింగ్స్‌ను తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ గ్రాండ్ సక్సెస్ అయింది. బెంగళూరు బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో అయ్యర్ సేన చాలా తక్కువ స్కోరు చేసింది.

ప్లేఆఫ్స్ రేసులో పరుగులు తీయాలంటే కీలకంగా మారిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను భయపెడుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్ సేన.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకదశలో 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులతో పటిష్టంగా ఉన్న పంజాబ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కృనాల్ పాండ్యా, సూయాష్ శర్మ చెరో 2 వికెట్లతో ఆ టీమ్ నడ్డి విరిచారు. రొమారియో షెఫర్డ్‌కు ఒక వికెట్ దక్కింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్. జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31) ఫర్వాలేదనిపించారు. పేసర్ మార్కో జాన్సన్ (25) చివర్లో బ్యాట్ ఝళిపించాడు.
కుమ్మేయడం ఖాయం
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై చేజింగ్‌లో ఆర్సీబీకి పెద్దగా కష్టాలు ఎదురవకపోవచ్చు. అయితే స్పిన్‌కు మద్దతు లభిస్తున్నందున యుజ్వేంద్ర చాహల్‌ను కాచుకోవాలి. అతడ్ని ఒక్కడ్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తే సగం పని పూర్తయినట్లే. సాల్ట్ దగ్గర నుంచి డేవిడ్ వరకు బ్యాటర్లంతా భీకర ఫామ్‌లో ఉన్నందున కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని బెంగళూరు ఉఫ్‌మంటూ ఊదిపారేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కోహ్లీ లాంటి ఒక బ్యాటర్ ఓ ఎండ్‌లో సాలిడ్‌గా నిలబడాలి. చాహల్, అర్ష్‌దీప్, స్టొయినిస్, జాన్సన్ లాంటి క్వాలిటీ బౌలర్లు ఉన్నందున పంజాబ్‌ను లైట్ తీసుకోకుండా కాస్త ప్లానింగ్‌తో బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ఆర్సీబీదే.
ఇవీ చదవండి:
కృనాల్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్
ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్
పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి