Share News

IPL 2025 Gauge Test: పరువు తీసుకున్న కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:33 PM

Indian Premier League: కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ పరువు తీసుకుంది. ఒకరు, ఇద్దరు కాదు.. ఆ జట్టుకు చెందిన ఏకంగా ముగ్గురు స్టార్లు బ్యాట్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Gauge Test: పరువు తీసుకున్న కేకేఆర్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్
KKR vs PBKS

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పరువు తీసుకుంది. అసలే పడుతూ లేస్తూ పోతున్న రహానె సేన.. ఇప్పుడు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన థ్రిల్లింగ్ ఫైట్‌లో 16 పరుగుల స్మాల్ మార్జిన్‌తో ఓడిపోయింది కోల్‌కతా. లో స్కోరింగ్ ఫైట్‌లో ఓటమితో పాటు ముగ్గురు స్టార్లు గాగ్ టెస్ట్‌లో ఫెయిల్ అవడం కూడా కేకేఆర్‌ను టెన్షన్ పెడుతోంది. ఆల్‌రౌండర్స్ ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌తో పాటు అన్రిచ్ నోకియా‌లు గాగ్ టెస్ట్‌లో విఫలమయ్యారు. అసలు ఏంటీ గాగ్ టెస్ట్.. ఇందులో ఫెయిల్ అయితే ఏం చేస్తారు.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..


వేరే బ్యాట్లతో..

కాంపిటీటివ్ క్రికెట్‌లో ప్రతి మ్యాచ్‌కు ముందు బ్యాట్ (గాగ్) టెస్ట్ నిర్వహిస్తారు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఆటగాళ్లు వినియోగించే బ్యాట్లను అంపైర్ పరిశీలిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆ బ్యాట్లను మ్యాచ్‌లోకి అనుమతిస్తారు. తనిఖీల్లో ఫెయిలైన బ్యాట్లు వాడేందుకు పర్మిషన్ ఇవ్వరు. నిన్న పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌లో ఇదే జరిగింది. కేకేఆర్ స్టార్లు రస్సెల్, నరైన్, నోకియాల బ్యాట్లు గాగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాయి. అంపైర్లు వీటిని తనికీ చేయగా బ్యాట్ల మందం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో వాళ్లు వేరే బ్యాట్లను తెప్పించి క్రీజులోకి దిగాల్సి వచ్చింది.


వాళ్లంతా ఏం చేస్తున్నట్లు..

బ్యాట్ల ప్రమాణాలు, పరిమాణం విషయంలో ఐపీఎల్‌లో నిర్దిష్టంగా కొన్ని రూల్స్ పాటిస్తున్నారు. నియమాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు అంపైర్లు. ఇంతకుముందు ఈ చెకింగ్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే జరిగేది. అలా ప్రమాణాలను అందుకోని బ్యాట్లను అక్కడే పెట్టేసేవారు. కానీ ఈ సీజన్‌లో గ్రౌండ్‌లో కూడా బ్యాట్లను తనిఖీ చేస్తున్నారు. ఇదే క్రమంలో చెక్ చేయగా నరైన్, నోకియా బ్యాట్లు ఫెయిల్ అయ్యాయి. ఐపీఎల్‌లో హిస్టరీలో ఇలా ఓ బ్యాటర్ గ్రౌండ్‌లోకి వచ్చి బ్యాట్ చేంజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్.. ముగ్గురు స్టార్ల బ్యాట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది.. ఇలా పరువు తీయడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు లీగ్‌ బ్రాండ్‌ను దెబ్బ తీస్తాయని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ఈ బుడతడి తండ్రి.. బ్యాటర్లకు మొగుడు

కాటేరమ్మ కొడుకు అనే నేను..

తండ్రైన టీమిండియా స్టార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2025 | 04:35 PM