Mitchell Santner: ఆ ఒక్కడి వల్లే ఓడాం.. కివీస్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:29 PM
India vs New Zealand Final 2025: న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒక్కడే తమ ఓటమిని శాసించాడని అన్నాడు. మరి.. శాంట్నర్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

న్యూజిలాండ్ జట్టు మరోసారి తుదిమెట్టుపై చతికిలపడింది. ఐసీసీ టోర్నమెంట్స్‌లో నాకౌట్ మ్యాచుల్లో తడబడే అలవాటు ఉన్న కివీస్.. టీమిండియాతో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్-2025లోనూ అదే రిపీట్ చేసింది. ఆఖరాట వరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన బ్లాక్‌క్యాప్స్.. భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం సరెండర్ అయిపోయింది. అన్ని రంగాల్లోనూ విఫలమై కప్పును చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి మిచెల్ శాంట్నర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడే తమకు ట్రోఫీని దూరం చేశాడని అన్నాడు. మరి.. శాంట్నర్ ఎవర్ని ఉద్దేశించి ఇలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
మ్యాచ్‌ను లాగేసుకున్నాడు
‘ఈ టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. మేం డిఫరెంట్ పిచ్‌లపై ఆడుతూ వచ్చాం. దాదాపుగా కప్పును అందుకోబోయాం. కానీ తృటిలో చేజారింది. అయితే ఈ టోర్నీ గొప్పగా సాగింది. మాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి చాలెంజ్‌కు మేం ఎదురొడ్డి నిలబడ్డాం. ఇవాళ మేం మంచి జట్టు చేతిలో ఓడిపోయాం. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు. మేం 25 పరుగులు తక్కువ చేశాం. ఛేజింగ్‌లో రోహిత్ సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశాడు. అతడు మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు’ అని శాంట్నర్ చెప్పుకొచ్చాడు.
బ్యాక్ సీట్‌లోకి నెట్టేశాడు
దుబాయ్ పిచ్ మీద బ్యాటింగ్ చేయడానికి పవర్‌ప్లే కరెక్ట్ టైమ్ అని.. దీన్ని రోహిత్-గిల్ జోడీ సమర్థంగా వినియోగించుకున్నారని శాంట్నర్ తెలిపాడు. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ తమను బ్యాక్ సీట్‌లోకి నెట్టిందని పేర్కొన్నాడు కివీస్ సారథి. అతడి వల్లే తమకు కప్పు దూరమైందన్నాడు. తాము ఎంత ప్రయత్నించినా చివరకు భారత్‌కే విజయం దక్కిందన్నాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్ చేసిన తీరు.. టోర్నీ ఆసాంతం గేమ్‌ను అర్థం చేసుకొని అతడు ఆడిన విధానం సూపర్బ్ అని మెచ్చుకున్నాడు శాంట్నర్.
ఇవీ చదవండి:
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: కోహ్లీ
గజినీలా మారిన రోహిత్.. కప్పు మర్చిపోయి..
రోహిత్‌కు అనుష్క హగ్.. రితికా ముందే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి