Share News

Chahal-Mahvash: చాహల్‌కు వికెట్.. గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా..!

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:07 PM

పంజాబ్ కింగ్స్ బౌలింగ్ సమయంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గర్ల్‌ఫ్రెండ్ తెగ సందడి చేసింది. చాహల్ వికెట్ తీసిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Chahal-Mahvash: చాహల్‌కు వికెట్.. గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా..!
MI vs PBKS

పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎవరి అంచనాలకు అందని రీతిలో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్-2025 క్వాలిఫయర్-2 సమరంలో అయ్యర్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కప్పు కోసం రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది పంజాబ్. ఈ విక్టరీతో ఆ టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఫ్యాన్స్ ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులే కాదు.. కో-ఓనర్ ప్రీతి జింటా, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ కూడా సంబురాలు చేసుకున్నారు.

1.jpg


ఒక్కసారిగా లేచి..

ముంబై-పంజాబ్ పోరు సమయంలో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ తెగ సందడి చేసింది. చాహల్ వికెట్ తీసిన సమయంలో ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 14వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (44)ను ఔట్ చేశాడు చాహల్. అతడి బౌలింగ్‌లో నేహాల్ వధేరా పట్టిన క్యాచ్‌తో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు స్కై. దీంతో స్టాండ్స్‌లో కూర్చున్న చాహల్ గర్ల్‌ఫ్రెండ్.. ఒక్కసారిగా లేచి గంతులు వేసింది. జంప్ చేస్తూ, గాల్లో పంచులు విసురుతూ, నవ్వుతూ తెగ సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో ప్రీతి జింటా కూడా చాహల్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఆర్జే మహ్వాష్ సందడి మామూలుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చాహల్‌-ఆర్జే మహ్వాష్ గత కొన్నాళ్లుగా డేటింగ్‌ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ అవడం, చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు జంటగా అటెండ్ అవడంతో వీళ్లు రిలేషన్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.


ఇవీ చదవండి:

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్

ఓటమి బాధ తట్టుకోలేకపోయాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 12:13 PM