LSG vs DC Toss: టాస్ నెగ్గిన డీసీ.. అక్షర్ డెసిషన్ ఇదే..
ABN , Publish Date - Apr 22 , 2025 | 07:19 PM
IPL 2025: లక్నో-ఢిల్లీ మ్యాచ్ మొదలైపోయింది. పంత్-రాహుల్ వార్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇక మూడు గంటలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటే. మరి.. ఈ మ్యాచ్‌లో టాస్ ఎవరు నెగ్గారు.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ సెకండాఫ్‌లో ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో పంత్ సేన ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది. ప్లేయింగ్ ఎలెవన్ విషయానికొస్తే.. ఇరు జట్లలోనూ పెద్దగా మార్పుచేర్పులు జరగలేదు. డీసీ టీమ్‌లో దుష్మంత చమీర ఎంట్రీ ఇచ్చాడు. ఆ జట్టులో ఈ ఒక్కటే చేంజ్ చేశారు. మిగతా ఆటగాళ్లంతా గత మ్యాచ్‌లో ఆడినవాళ్లే. అటు లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ మార్పూ చేయలేదు. విన్నింగ్ టీమ్‌ను కంటిన్యూ చేసింది ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్.
ఇవీ చదవండి:
రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..
గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి