Share News

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:36 PM

Today IPL Match: ఐపీఎల్‌లో రివేంజ్ టైమ్ స్టార్ట్ అయింది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఇవాళ భీకర యుద్ధం జరగనుంది. ఇందులో గెలవడం ఇరు జట్లకూ కంపల్సరీ. ఈ నేపథ్యంలో రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

LSG vs DC Prediction: లక్నో వర్సెస్ ఢిల్లీ.. రివేంజ్‌కు బెస్ట్ చాన్స్.. గెలిచేదెవరో..
LSG vs DC Prediction

ఐపీఎల్‌లో పలు జట్ల మధ్య నెవర్ ఎండింగ్ రివేంజ్ నడుస్తూ వస్తోంది. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులే దీనికి ఉదాహరణ. ఆయా టీమ్స్ మధ్య గ్రూప్ స్టేజ్ బ్యాటిల్స్‌తో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లోనూ ఇంట్రెస్టింగ్ ఫైట్స్ జరిగాయి. ఇప్పుడు ఈ కోవలోనే మరో రెండు జట్ల మధ్య రివేంజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది టీమ్స్ మధ్య కొట్లాట కాదు. కీలక ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఫైట్. లాస్ట్ సీజన్ వరకు ఢిల్లీకి ఆడుతూ వచ్చిన పంత్ ఈసారి లక్నోకు మారాడు. అటు ఎల్‌ఎస్‌జీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాహుల్.. ఇప్పుడు డీసీ తరఫున అదరగొడుతున్నాడు.


ప్రూవ్ చేసుకోవాల్సిందే..

లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాతో వివాదం కారణంగా డీసీకి మారాడు రాహుల్. అందుకే ఈసారి ఎల్‌ఎస్‌జీపై అతడు రెచ్చిపోయి ఆడతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు డీసీ నుంచి వచ్చేసిన పంత్ కూడా తాను బెటర్ కెప్టెన్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ హీటెక్కడం గ్యారెంటీగా కనిపిస్తోంది. పంత్-రాహుల్‌కు ఇది హోం గ్రౌండ్‌లా మారిపోయింది. ఇరు జట్లకూ అభిమానుల నుంచి మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గెలిచేదెవరో ఇప్పుడు చూద్దాం..


బలాలు

లక్నో: చెన్నై పై ఓటమితో డీలాపడిన పంత్ సేన.. రాజస్థాన్ మీద విజయంతో తిరిగి ట్రాక్‌ ఎక్కింది. పూరన్, మార్ష్‌కు తోడుగా మార్క్రమ్, బదోని, సమద్‌ జోరు మీదుండటం లక్నోకు బిగ్ ప్లస్. బౌలింగ్‌లో హెల్మెట్ స్టార్ ఆవేశ్ ఖాన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్‌ అతడు ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించాడు. మార్క్రమ్, శార్దూల్ కూడా అవసరమైనప్పుడు బ్రేక్‌త్రూలు అందిస్తున్నారు.

ఢిల్లీ: వరుస విజయాలతో ఊపు మీదున్న డీసీకి లాస్ట్ మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ చేతుల్లో ఓడిపోయింది డీసీ. బ్యాటింగ్‌లో పోరెల్, కరుణ్ నాయర్, రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్.. ఇలా అందరూ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కుల్దీప్, అక్షర్, స్టార్క్ మంచి టచ్‌లో కనిపిస్తున్నారు.


బలహీనతలు

లక్నో: బ్యాటింగ్ యూనిట్‌లో కెప్టెన్ పంత్ ఒక్కడే ఫెయిల్ అవుతున్నాడు. ఎలాంటి అప్రోచ్‌తో ఆడాలో తేల్చుకోలేకపోవడంతో బౌలర్లు అతడ్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎల్‌ఎస్‌జీ బౌలింగ్‌లో అందరూ అదరగొడుతున్నారు. అయితే శార్దూల్, ప్రిన్స్ యాదవ్‌ పరుగులు కట్టడి చేయడం మీద మరింత ఫోకస్ చేయాలి.

ఢిల్లీ: లాస్ట్ మ్యాచ్‌లో మంచి స్టార్ట్స్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు ఈ టీమ్ బ్యాటర్లు. దీనికి తోడు బౌలింగ్‌లో కుల్దీప్ తప్ప మిగతా వాళ్లంతా ఫ్లాప్ అయ్యారు. అక్షర్, స్టార్క్ పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీయడంపై మరింత ఫోకస్ చేయాలి. ముఖేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఇతర బౌలర్లకు వర్క్ ఈజీ అవుతుంది.


హెడ్ టు హెడ్

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 6 మ్యాచులు జరిగాయి. ఇందులో మూడింట డీసీ.. మరో మూడింట ఎల్‌ఎస్‌జీ విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

బౌలింగ్, బ్యాటింగ్, తాజా ఫామ్, కాన్ఫిడెన్స్, గత రికార్డులు.. ఇలా ఎందులో చూసుకున్నా లక్నో కంటే ఢిల్లీ పటిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ్టి పోరులో రాహుల్ టీమ్ పంత్ సేనను మట్టికరిపించడం ఖాయం.


ఇవీ చదవండి:

గిల్ చేతికి ఏమైంది..

గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2025 | 05:42 PM