Share News

Kuldeep Yadav: కుల్దీప్ అదిరిపోయే స్కెచ్.. ఇంగ్లండ్‌కు ఇక చుక్కలే!

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:41 PM

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధం అవుతున్నాడు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. రవిచంద్రన్ అశ్విన్ గైర్హాజరీలో భారత స్పిన్ విభాగంలో జడేజాతో కలసి కీలకపాత్ర పోషించాలని అతడు భావిస్తున్నాడు.

Kuldeep Yadav: కుల్దీప్ అదిరిపోయే స్కెచ్.. ఇంగ్లండ్‌కు ఇక చుక్కలే!
Kuldeep Yadav

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రఫ్ఫాడించాలని చూస్తున్నాడు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చేయడంతో రవీంద్ర జడేజాతో కలసి టీమిండియా స్పిన్ విభాగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కుల్దీప్ మీద పడింది. ఈ సవాల్‌కు సిద్ధమవుతున్న స్టార్ స్పిన్నర్.. ఇంగ్లండ్‌ బెండు తీసేందుకు సొంత ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాడు. బంతితోనే కాదు.. బ్యాట్‌తోనూ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాలని అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కుల్దీప్ బయటపెట్టాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..


బంతితోనే కాదు.. బ్యాట్‌తోనూ!

‘ఇంగ్లండ్‌‌తో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. రెడ్ బాల్ క్రికెట్‌కు నా బ్యాటింగ్ టెక్నిక్ బాగా నప్పుతుంది. నా డిఫెన్స్ విషయంలో నా మీద నాకు నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌తో చివరి సిరీస్‌లో బ్యాట్‌తో నేను రాణించా. కాబట్టి ఈసారి కూడా ఆ జట్టు మీద పరుగులు చేయగలనని అనుకుంటున్నా. బంతితోనే కాదు.. బ్యాట్‌తోనూ పరుగులు చేస్తూ జట్టుకు దోహదపడాలని భావిస్తున్నా. బ్యాట్‌తో ఎక్కువగా సాధన చేస్తున్నా. నేను బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి గనుక వస్తే వెంటనే రంగంలోకి దిగాలని అనుకుంటున్నా. ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకోవడం మీద దృష్టి సారిస్తున్నా’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

kuldeep.jpg


ప్లాన్ ప్రకారమే..

భారత టెస్ట్ టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నాడు కుల్దీప్. గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లలేకపోయానని, సర్జరీ తర్వాత కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టిందన్నాడు స్టార్ స్పిన్నర్. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో సత్తా చాటేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని అతడు తెలిపాడు. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకమని చెప్పుకొచ్చాడు కుల్దీప్. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగితే అద్భుతంగా ఉంటుందన్నాడు. కుల్దీప్ మాటలు విన్న నెటిజన్స్.. బంతితోనే కాదు, బ్యాట్‌తో అదరగొట్టాలనుకోవడం మంచి విషయమని అంటున్నారు. అతడు గనుక రాణిస్తే ఇంగ్లండ్‌కు చుక్కలేనని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

సూర్యవంశీకి రెడ్ సిగ్నల్

కోచ్ అంటే ఇలా ఉండాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 05:41 PM