Share News

Rinku-Kuldeep Controversy: కలసిపోయిన రింకూ-కుల్దీప్.. ఎక్కడో తేడా కొడుతుందే..

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:53 PM

Indian Premier League: చెంపదెబ్బతో ఐపీఎల్‌లో కాంట్రవర్సీకి దారితీశాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఒక్కపనితో లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎట్టకేలకు దీనికి ఎండ్‌కార్డ్ పలికాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Rinku-Kuldeep Controversy: కలసిపోయిన రింకూ-కుల్దీప్.. ఎక్కడో తేడా కొడుతుందే..
Rinku Singh-Kuldeep Yadav

వచ్చామా.. బౌలింగ్ వేశామా.. వెళ్లిపోయామా.. ఇదీ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తీరు. డొమెస్టిక్ టోర్నమెంట్ నుంచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ సిరీస్‌ల వరకు ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తాడీ స్పిన్నర్. కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుంటూ మిగతవాళ్లతోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు. అలాంటోడు ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్-డీసీ మ్యాచ్ ముగిశాక పించ్ హిట్టర్ రింకూ సింగ్‌ను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టి సడన్‌గా వైరల్ టాపిక్‌గా మారాడు. ఒక్కపనితో లేనిపోని విమర్శలు మూటగట్టుకున్న కుల్దీప్.. ఎట్టకేలకు రింకూతో కలసిపోయి కాంట్రవర్సీకి చెక్ పెట్టాడు.


ఓన్లీ దోస్తానా..

కుల్దీప్-రింకూ వివాదానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ ఇద్దరు స్టార్లు హార్ట్ సింబల్స్‌తో ఫోజులు ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది డీసీ. దీనికి కేవలం ప్రేమ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇందులో కుల్దీప్-రింకూ లవ్ సింబల్స్ చూపిస్తూ ఫొటోలు దిగారు. ఫోజులు ఇస్తున్న సమయంలో నవ్వుల్లో మునిగిపోయారు. లవ్ సింబల్స్ ఎలా ఇవ్వాలో కుల్దీప్‌కు నేర్పుతూ కనిపించాడు రింకూ. ఇది చూసిన నెటిజన్స్.. ఎట్టకేలకు ఇద్దరు కలసిపోయారుగా అని అంటున్నారు. నో కొట్లాట.. ఓన్లీ దోస్తానా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


ఎండ్‌కార్డ్ పడ్డట్లేనా..

కోల్‌కతా-ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత కొందరు ఆటగాళ్లు ఒక చోట చేరి మాట్లాడుకోసాగారు. ఈ తరుణంలో జోక్స్ వేస్తూ అందర్నీ నవ్విస్తున్న రింకూ చెంపచెళ్లుమనిపించాడు కుల్దీప్. దీంతో ఒక్కసారిగా షాకైన స్టార్ బ్యాటర్.. దాన్ని లైట్ తీసుకున్నాడు. అయితే కుల్దీప్ మరోమారు ఇలాగే చేయడంతో కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించాడు రింకూ. దీంతో జెంటిల్మన్ గేమ్‌ పరువు తీస్తున్నారని.. కుల్దీప్‌ను బ్యాన్ చేయాలంటూ నెట్టింట డిమాండ్లు పెరిగాయి. అందరిముందే ఇలా చేయడం ఏంటంటూ స్పిన్నర్‌ను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ ఏకిపారేశారు. అయితే ఎట్టకేలకు డీసీ టీమ్ తాజా వీడియోతో దీనికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. కానీ కొందరు నెటిజన్స్ మాత్రం.. ఏదో తేడా కొడుతోందని అంటున్నారు. ఎక్కడ కుల్దీప్ మీద బ్యాన్ పడుతుందోననే భయంతో పాటు బ్యాడ్ నేమ్ రావొద్దనే ఉద్దేశంతోనే ఇలా కవర్ చేస్తూ వీడియో చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మొత్తానికి ఇద్దరు ఆటగాళ్లు కలసిపోవడంతో ప్రస్తుతానికి వివాదానికి ఎండ్‌కార్డ్ పడినట్లే.


ఇవీ చదవండి:

కోహ్లీపై విమర్శలు.. కౌంటర్ ఇచ్చిపడేశాడుగా

నా భర్త కోసం స్కెచ్ వేశారు: పుజారా భార్య

రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 07:00 PM