KL Rahul On Run-Out: తప్పంతా నాదే.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:40 AM
రిషబ్ పంత్ తప్పేమీ లేదని తేల్చేశాడు క్లాసికల్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తాము ముందే మాట్లాడుకున్నామంటూ పలు ఆసక్తికర విషయాలు అతడు పంచుకున్నాడు.

లార్డ్స్ టెస్ట్ రసకందాయంలో పడింది. అటు ఇంగ్లండ్, ఇటు భారత్ రెండూ నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. దీంతో నాలుగో రోజు ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డే-4 ఎవరు బాగా రాణిస్తే వాళ్లకు మ్యాచ్‌పై పట్టు చిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నాలుగో రోజు ఆటను శాసించే చాన్స్‌ను భారత్ మిస్ చేసుకుంది. కేఎల్ రాహుల్-రిషబ్ పంత్ సమన్వయ లోపం టీమ్‌కు శాపంగా మారింది. వీళ్లిద్దరూ ఆ తప్పు గనుక చేసి ఉండకపోతే మూడో రోజు ఆధిపత్యం చూపించి.. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ బెండు తీసే చాన్స్ మనకు ఉండేది. అసలేం జరిగిందంటే..
రనౌట్‌తో..
మూడో రోజు ఆటలో రాహుల్ (100), పంత్ (74) బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఒకవైపు పంత్ బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడితే.. కేఎల్ తన స్టైల్‌లో క్లాసికల్ షాట్లతో అలరించాడు. వీళ్లిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. వీళ్లను ఔట్ చేయలేక ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ స్కోరును దాటేసి భారత్ భారీ ఆధిక్యం సాధించడం పక్కా అని అంతా అనుకుంటున్న తరుణంలో పంత్ రనౌట్ అయ్యాడు. రాహుల్ 99 పరుగుల వద్ద ఉండటంతో అతడికి స్ట్రైక్ ఇద్దామని అనుకొని పంత్ ఔట్ అయ్యాడు. దీనిపై రాహుల్ స్పందించాడు. ఇది తన తప్పేనని.. సెంచరీ విషయంలో తాము ముందే మాట్లాడుకున్నామని స్పష్టత ఇచ్చాడు.
ముందే మాట్లాడా..
‘రనౌట్‌కు కొన్ని ఓవర్ల ముందు పంత్‌తో నేను మాట్లాడా. కుదిరితే లంచ్‌కు ముందే సెంచరీ పూర్తి చేస్తానని అతడికి చెప్పా. బషీర్ చివరి ఓవర్ వేస్తుండటంతో మూడంకెల మార్క్‌కు చేరుకునేందుకు ఇదే సరైన సమయమని భావించా. కానీ దురదృష్టవశాత్తూ నేను కొట్టిన బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. అది బౌండరీకి వెళ్లి ఉంటే సెంచరీ కంప్లీట్ అయ్యేది. దీంతో పంత్ నాకు స్ట్రైక్ ఇచ్చేందుకు రిస్క్ చేశాడు. రనౌట్ జరిగి ఉండాల్సింది కాదు. ఇది మూమెంటమ్‌ను మార్చేసింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి