KL Rahul IPL 2025: ఆ రీజన్ వల్లే బయటకు వచ్చేశా.. బాంబు పేల్చిన రాహుల్
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:16 PM
Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ నయా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు లక్నోకు ఆడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్.. ఈసారి డీసీకి మారాడు. ఆ టీమ్ విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు.

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ తాజా సీజన్‌లో అదరగొడుతున్నాడు. వరుసగా సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన కేఎల్.. మెగా ఆక్షన్ టైమ్‌లో ఆ జట్టును వీడాడు. దీంతో వేలంలో అతడ్ని డీసీ దక్కించుకుంది. లాస్ట్ ఐపీఎల్ టైమ్‌లో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అవడం బిగ్ కాంట్రవర్సీగా మారింది. ఆ ఘటన వల్లే రాహుల్ టీమ్‌ను వీడాడనే పుకార్లు వినిపించాయి. అయితే దీనిపై ఇన్నాళ్లూ సైలెన్స్ మెయింటెయిన్ చేసిన స్టైలిష్ బ్యాటర్.. ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు. లక్నో నుంచి తాను బయటకు రావడానికి గల కారణం ఏంటో షేర్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
ప్రెజర్ తట్టుకోలేకే..
కొత్త సీజన్‌ను ఫ్రెష్‌గా మొదలుపెట్టాలని భావించానని రాహుల్ అన్నాడు. అందుకే రిటెన్షన్స్‌కు సంబంధించిన ప్రకటన రాగానే టీమ్ నుంచి బయటకు వచ్చానని చెప్పాడు. ఆల్రెడీ ఐపీఎల్‌లో ఫుల్ ప్రెజర్ ఉంటుందని, మరింత ఒత్తిడి తీసుకోవాలని తాను భావించడం లేదన్నాడు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్‌కు మారాలని అనుకున్నానని తెలిపాడు రాహుల్. కొత్త ఆప్షన్స్ కోసం ప్రయత్నించానని, మరింత స్వేచ్ఛతో ఆడాలనీ డిసైడ్ అయ్యానని పేర్కొన్నాడు కేఎల్.
లక్నోకు చుక్కలే..
గెలుపోటములతో సంబంధం లేకుండా టీమ్ ఎన్విరాన్‌మెంట్, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నాడు రాహుల్. ఒక ఆటగాడిగా తాను కోరుకునేది ఇదేనని చెప్పుకొచ్చాడు. దీని వల్ల మనలోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను బయటకు తీసేందుకు అవకాశం ఉంటుందన్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. కేఎల్ బాంబు పేల్చాడని అంటున్నారు. లక్నో యాజమాన్యం పెట్టిన ప్రెజర్ వల్లే బయటకు వచ్చినట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడని.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ మీద అతడు పగ తీర్చుకోవడం ఖాయమని, సంజీవ్ గోయెంకాకు ఇక చుక్కలేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి