KL Rahul: కేఎల్ రాహుల్ ఇక్కడితో ఆగడు.. ఈ మాటలు వింటే గూస్‌బంప్సే!
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:01 PM
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన రాహుల్.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

భారత స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్ చేతికి అందుకుంటే చాలు పరుగుల వరద పారిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నుంచి అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది. జట్టు గెలుపు కోసం డిఫెన్స్ చేయడంతో పాటు పించ్‌హిట్టర్‌లా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడేందుకూ రాహుల్ వెనుకాడటం లేదు. చాంపియన్స్ ట్రోఫీ-2025, ఐపీఎల్-2025లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అందరి మనసుల్ని దోచుకున్న రాహుల్.. ఇంగ్లండ్ పర్యటనలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా స్టోక్స్ సేనతో జరిగిన తొలి టెస్ట్‌లో క్లాసికల్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీతో జట్టు విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే రాహుల్ ఇక్కడితో ఆగడని.. ఇక ముందు అతడి బ్యాట్ మరింతగా గర్జిస్తుందని సీనియర్ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు.
రాణించక తప్పదు..
‘లీడ్స్ టెస్ట్‌లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. పంత్ టెస్టుల్లో ఆడటాన్ని ఇష్టపడతాడు. ఈ మధ్య అతడు ఎక్కువగా పరుగులు చేయలేదు. అందుకే రాణించాలనే కసి, పట్టుదలతో కనిపించాడు. లీడ్స్‌లో పరుగులు చేయాలనే దాహంతో బ్యాటింగ్ చేశాడు. దీన్నే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నా. అయితే పంత్‌తో పాటు తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో మరో బ్యాటర్ ఉన్నాడు. అతడే కేఎల్ రాహుల్. అతడు టీమ్‌లో సీనియర్ క్రికెటర్. లీడ్స్ టెస్ట్ ఫామ్‌నే రాహుల్ సిరీస్ మొత్తం కొనసాగించాల్సి ఉంటుంది. భారత క్రికెట్‌కు అతడి అవసరం ఉంది. ఒక సెంచరీతో అతడు ఆగడు. వన్ మ్యాచ్ పెర్ఫార్మర్‌గా మిగలడు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కాగా, రెండో టెస్ట్ కోసం రాహుల్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రాహుల్ తగ్గడంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. దీంతో కేఎల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని.. సిరీస్‌లో విధ్వంసం తప్పదని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి