Share News

India Strategy On Day 3: భారత్ చేతుల్లోనే మ్యాచ్.. ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:54 PM

లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్‌ సెషన్‌కు ఆధిపత్యం చేతులు మారుతోంది. దీంతో మూడో రోజు ఎవరు డామినేషన్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

India Strategy On Day 3: భారత్ చేతుల్లోనే మ్యాచ్.. ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!
KL Rahul

తొలి రెండు టెస్టులకు భిన్నంగా సాగుతోంది లార్డ్స్ టెస్ట్. ఈ మ్యాచ్‌లో సెషన్ సెషన్‌కూ ఆధిపత్యం చేతులు మారుతూ పోతోంది. డే-1 ఇరు టీమ్స్ బాగా పోరాడాయి. అయితే ఇంగ్లండ్ కాస్త పైచేయి సాధించింది. కానీ రెండో రోజు ఆటలో బౌలర్లు చెలరేగడంతో భారత్ డామినేషన్ నడిచింది. ఆ తర్వాత బ్యాటర్లు కూడా రాణించడంతో డే-2ను సానుకూలంగా ముగించింది భారత్. కానీ శుబ్‌మన్ గిల్ (16), అంతకంటే ముందు కరుణ్ నాయర్ (40) వికెట్లను కోల్పోవడంతో ఎడ్జ్ సాధించలేకపోయింది మెన్ ఇన్ బ్లూ. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది భారత్. మూడ్రోజులు మిగిలి ఉన్న ఈ టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రిజల్ట్ మనకు అనుకూలంగా రావాలంటే మాత్రం ఓ మ్యాజిక్ జరగాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం..


చెమటోడ్చాల్సిందే..

లార్డ్స్ పిచ్ నుంచి పేసర్లకు మంచి మద్దతు లభిస్తోంది. బంతి ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. స్పిన్నర్లకూ కొంతమేర సపోర్ట్ దొరుకుతోంది. ఒక్కోసారి బాల్ ఊహించిన దాని కంటే కిందకు వస్తుండటంతో బ్యాటర్లు షాట్లు ఆడటం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్కోరును దాటాలంటే భారత్ చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. రాహుల్-పంత్ లీడ్స్‌లో చేసిన మ్యాజిక్‌నే మళ్లీ రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు.


ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన..!

రాహుల్-పంత్ ఔట్ అయినా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇంకా క్వాలిటీ బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. అయితే రాహుల్-పంత్‌కు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. దీనికి తోడు ఒకరు డిఫెన్స్‌తో ప్రత్యర్థుల ఓపికను పరీక్షిస్తే, మరొకరు అటాక్‌ చేస్తూ భయపెడుతుంటారు. కాబట్టి వీళ్లు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడుతూ భారీ భాగస్వామ్యం నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తర్వాతి బ్యాటర్లలో జడేజా తప్పితే మిగతా వారికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. నితీష్, సుందర్ పట్టుదలతో ఆడితే భారీ స్కోర్లు బాదగల సమర్థులే. కానీ రాహుల్-పంత్ ఎక్కువ సేపు ఆడాలని.. ఆ తర్వాత మిగిలిన పనిని తెలుగోడికి అప్పగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవీ చదవండి:

చనిపోతాడని అనుకోలేదు: సిరాజ్

కరుణ్ నాయర్ ఖేల్‌ఖతం!

బయటపడ్డ గిల్-సారా రిలేషన్‌షిప్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 01:58 PM