KKR vs PBKS: పంజాబ్‌తో చావోరేవో.. కేకేఆర్ లైనప్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:16 PM
Today IPL Match: ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. ఒక్కో రిజల్ట్‌తో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ కీలక సమరం జరగనుంది.

ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న జట్టుకు, ఆ బెర్త్ కోసం పోరాడుతున్న మరో టీమ్‌కు మధ్య ఇవాళ ఫైట్ జరగనుంది. ఆ జట్లే పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్. 8 మ్యాచుల్లో 5 విజయాలతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు దగ్గర్లో నిలిచింది అయ్యర్ సేన. అటు 8 మ్యాచుల్లో 3 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది కేకేఆర్. ఆడే ప్రతి మ్యాచ్‌లో రహానే సేన గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ జరిగే పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. విజయం కీలకం కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్‌తో పంజాబ్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది కేకేఆర్.
స్పిన్‌తో పడగొడతారా..
స్పిన్‌కు సహకరించే ఈడెన్ పిచ్‌పై ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో వెళ్లాలని కేకేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొయిన్ అలీని కంటిన్యూ చేయాలని భావిస్తోందట. ఓపెనర్లు గుర్బాజ్, నరైన్ ఎలాగూ టీమ్‌లో ఉండటం పక్కా. ఆ తర్వాత రహానె, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ బ్యాటింగ్‌కు వస్తారు. రస్సెల్, మొయిన్ అలీ, రమణ్‌దీప్ ఫినిషింగ్ రోల్స్ తీసుకునే చాన్స్ ఉంది. వరుణ్ చక్రవర్తి ప్రధాన స్పిన్నర్‌గా ఎలాగూ టీమ్‌లో ఉంటాడు. హర్షిత్ రాణా మెయిన్ పేసర్‌గా ఆడతాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వైభవ్ అరోరాను దింపి పేస్ యూనిట్‌ను మరింత పటిష్టం చేసుకునే ఆలోచనల్లో కేకేఆర్ ఉందని తెలుస్తోంది. అటు బ్యాటింగ్‌లో ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు.. ఇటు బౌలింగ్‌లో పేస్ నుంచి స్పిన్ దాకా ప్రతి ప్లేస్‌కు పర్ఫెక్ట్ ప్లేయర్లను దింపి, పక్కా గేమ్ ప్లాన్‌తో బలమైన పంజాబ్‌కు షాక్ ఇవ్వాలని కేకేఆర్ ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
కేకేఆర్ (అంచనా): రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ/రోమన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: వైభవ్ అరోరా.
పంజాబ్ (అంచనా): ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, మార్కో జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్/వైశాఖ్ విజయ్‌కుమార్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: హర్‌ప్రీత్ బ్రార్/వైశాఖ్ విజయ్‌కుమార్.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి