Share News

England Big Plan: రాక్షసుడ్ని దింపుతున్న ఇంగ్లండ్.. గిల్ సేన ముందు మీ పప్పులు ఉడకవు!

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:18 AM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఘోర ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. లార్డ్స్ టెస్ట్ కోసం గట్టి స్కెచ్ వేస్తోంది. జోరు మీదున్న భారత్‌ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసుడ్ని దింపుతోంది.

England Big Plan: రాక్షసుడ్ని దింపుతున్న ఇంగ్లండ్.. గిల్ సేన ముందు మీ పప్పులు ఉడకవు!
IND vs ENG

టీమిండియాను చూసి వణుకుతోంది ఇంగ్లండ్ జట్టు. పెట్టని కోటగా ఉన్న ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల భారీ తేడాతో ఓటమి ఎదురవడంతో స్టోక్స్ సేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ గిల్ సేన ఫుల్ డామినేషన్ చూపించడంతో ఇంగ్లీష్ టీమ్‌కు దిక్కు తోచడం లేదు. లార్డ్స్ టెస్ట్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. జోరు మీదున్న టీమిండియాను అడ్డుకునేందుకు ఏకంగా ఓ పేస్ రాక్షసుడ్ని దింపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కన్ఫర్మ్ చేశాడు. మరి.. ఆతిథ్య జట్టులోకి వస్తున్న ఆ పేస్ పిచ్చోడు ఎవరు.. అతడితో భారత్‌కు ఇబ్బంది తప్పదా.. అనేది ఇప్పుడు చూద్దాం..


వికెట్లు తీయాలనే కసితో..

జులై 10 నుంచి జరిగే లార్డ్స్ టెస్ట్‌లో ఆడేందుకు జోఫ్రా ఆర్చర్ సంసిద్ధంగా ఉన్నాడని మెకల్లమ్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందన్నాడు. ఆర్చర్ వికెట్లు తీయాలనే ఆకలితో ఉన్నాడని చెప్పాడు. ‘ఆర్చర్ బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. అతడు వికెట్లు పడగొట్టాలనే కసితో ఉన్నాడు. గాయాల వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌కు చాన్నాళ్లుగా దూరంగా ఉన్నాడు. కానీ అతడేం చేయగలడో నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అవకాశం ఇస్తే అతడు ఒక రేంజ్‌లో చెలరేగుతాడు. ఇప్పటికే తానేం చేశాడో అతడికి కూడా తెలుసు. దానికి తోడు కొత్తగా పలు విషయాలను బౌలింగ్‌లో చేర్చుకున్నాడు. కాబట్టి ఆర్చర్ విశ్వరూపం చూపించడం ఖాయం’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.

Jofra-Archer---2.jpg


వాయించి వదులుతారు..

మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పరిశీలించాకే ఆర్చర్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలా.. వద్దా.. అనేది డిసైడ్ అవుతామన్నాడు మెకల్లమ్. అందరూ లార్డ్స్ టెస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇంగ్లండ్ కోచ్ పేర్కొన్నాడు. అయితే భారత అభిమానులు ఆర్చర్ పప్పులు గిల్ సేన దగ్గర ఉడకవని అంటున్నారు. వోక్స్, బషీర్, టంగ్, స్టోక్స్.. ఇలా అందరు ఇంగ్లండ్ బౌలర్లను భారత బ్యాటర్లు బాదిపారేస్తున్నారని చెబుతున్నారు. ఆర్చర్‌కు కూడా మెన్ ఇన్ బ్లూ ఇదే తరహా ట్రీట్‌మెంట్ ఇస్తారని.. మరీ ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అతడికి ఒక రేంజ్‌లో ఇచ్చిపడేయడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు.


ఇవీ చదవండి:

కోహ్లీ ఫ్రెండ్‌పై ఎఫ్‌ఐఆర్!

జొకో 16వ సారి..

400 వద్దనుకున్నాడు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 10:25 AM