Share News

IPL-BCCI: ఐపీఎల్‌లో ఇకపై 94 మ్యాచులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Apr 28 , 2025 | 07:47 PM

Today IPL Match: ఐపీఎల్ మ్యాచుల విషయంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మ్యాచుల సంఖ్యను ఒకేసారి పెంచేసిందట. ఇకపై ప్రతి సీజన్‌లో ఎన్ని మ్యాచులు జరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..

IPL-BCCI: ఐపీఎల్‌లో ఇకపై 94 మ్యాచులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం
IPL 2025

కాసులు పంట కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఘనంగా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటోంది భారత క్రికెట్ బోర్డు. ఈ లీగ్‌తో పేరు, ప్రఖ్యాతులతో పాటు దండిగా ఆదాయం సమకూర్చుకుంటోంది. అలాంటి బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచుల సంఖ్యను భారీగా పెంచాలని డిసైడ్ అయిందట. మరి.. ఇకపై ప్రతి సీజన్‌లో ఎన్ని మ్యాచులు ఆడనున్నారు.. బోర్డు తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఆ సీజన్ నుంచే..

ఐపీఎల్ మ్యాచులను 74 నుంచి 94కు పెంచాలని భావిస్తోంది బీసీసీఐ. ఈ విషయంపై ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హింట్ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఐపీఎల్-2028 నుంచి ప్రతి సీజన్‌లో 94 మ్యాచులను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అరుణ్ ధుమాల్ రివీల్ చేశారు. మీడియా హక్కులకు సంబంధించి అప్పుడే మార్పులు జరుగుతాయని.. అందుకే మ్యాచుల సంఖ్యను కూడా అప్పటినుంచి పెంచాలని అనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.


ప్లేయర్లకు కష్టమే..

ఐపీఎల్ మ్యాచుల సంఖ్య పెరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టోర్నీని నెలన్నర పాటు నిర్వహిస్తున్నారు. మ్యాచుల సంఖ్య పెరిగితే షెడ్యూల్ కూడా ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎక్కువగా డబుల్ హెడర్స్ పెడతారా.. లేదా.. రోజుల సంఖ్య పెంచి మ్యాచులు నిర్వహిస్తారా అనేది అరుణ్ ధుమాల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎలా చేసినా గానీ మరిన్ని గేమ్స్ ఆడటం వల్ల ప్లేయర్లపై మరింత భారం పడటం ఖాయం. మానసికంగా, శారీరకంగా వాళ్లు అలసిపోతారు. దీని వల్ల వాళ్ల ఇంటర్నేషనల్ కెరీర్ మీదా ప్రభావం పడే చాన్స్ ఉంది. అలాగే మ్యాచుల సంఖ్య పెంచితే ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో మార్పులు జరగక తప్పదు. మరి.. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.


ఇవీ చదవండి:

రాహుల్‌తో ఆడుకున్న కోహ్లీ

జీటీని భయపెడుతున్న రాజస్థాన్

గెలిపించినా తప్పని ట్రోల్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 28 , 2025 | 07:50 PM