Share News

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!

ABN , Publish Date - May 28 , 2025 | 08:21 PM

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో అతడు హీరోలను తలదన్నే లుక్‌తో మెరిశాడు. మరి.. ఈ ఫొటో విశేషాలు ఇప్పుడు చూద్దాం.. IPL 2025, KL Rahul

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారీ అభిమాన గణం ఉంది. భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తుండటంతో ఈ బెంగళూరు బాయ్‌కు హ్యూజ్ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. సాలిడ్ డిఫెన్స్‌తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్‌ను ఝళిపించడంలోనూ వెనుకాడడు రాహుల్. ఫార్మాట్‌కు తగ్గట్లు వేగంగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం కేఎల్ స్టైల్. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల తుఫాన్ సృష్టిస్తున్నాడీ విధ్వంసకారుడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ దుమ్మురేపాడు రాహుల్. 13 ఇన్నింగ్స్‌ల్లో 539 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగియడంతో ఇంటికి చేరుకున్నాడు కేఎల్. ఈ తరుణంలో అతడి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేశాడు రాహుల్.


ఫొటో వైరల్..

ఐపీఎల్‌లో భాగంగా ధర్మశాలకు వెళ్లిన సమయంలో కొండల నడుమ దిగిన ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు రాహుల్. షర్ట్ లెస్ లుక్‌లో హీరోలను తలపించే బాడీ, జులపాల జుట్టుతో ఆకట్టుకుంటున్నాడు కేఎల్. ఈ ఫొటోలో కొండల మధ్య నీళ్లు ప్రవహిస్తుండటం చూడొచ్చు. రాహుల్ లుక్ అదిరిందని, లాంగ్ హెయిర్‌ అతడికి బాగా సెట్ అయిందని నెటిజన్స్ అంటున్నారు. బాడీ సూపర్బ్ ఉంది, భలే ఫిట్‌గా ఉన్నాడని మెచ్చుకుంటున్నారు. కాగా, త్వరలో ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు రాహుల్. ఆ జట్టుతో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో లండన్ ‌ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక మొత్తం టీమిండియా అక్కడికి పయనం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టు బ్యాటింగ్ యూనిట్‌ను నడిపించాల్సిన బాధ్యత రాహుల్ మీదే ఉంది. మరి.. ఈ రెస్పాన్సిబిలిటీని అతడు ఎంత వరకు నెరవేరుస్తాడో చూడాలి.


ఇవీ చదవండి:

తెలుగోడి కోసం రోహిత్ ఫైట్

కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 08:42 PM