Blessing Muzarabani: ఆర్సీబీలోకి ఎక్స్‌ప్రెస్ బౌలర్.. బ్యాటర్లకు ఫ్యూజులు ఔట్
ABN , Publish Date - May 19 , 2025 | 01:44 PM
ఆర్సీబీ జట్టులోకి ఓ ఎక్స్‌ప్రెస్ బౌలర్ వచ్చేస్తున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ లుంగి ఎంగిడీ మిస్ అవడంతో ఆందోళనలో పడిన బెంగళూరుకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. ఎంగిడీకి రీప్లేస్‌మెంట్‌గా వస్తున్న ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 రీస్టార్ట్‌లో ప్రతి జట్టు ఒక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదే రీప్లేస్‌మెంట్స్. ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇళ్లకు వెళ్లిపోయిన చాలా మంది ఓవర్సీస్ ఆటగాళ్లు.. ఇంటర్నేషనల్ బిజీ షెడ్యూల్స్ వల్ల భారత్‌కు తిరిగి రాలేకపోతున్నారు. దీంతో వాళ్ల స్థానాల్లో సరైన ప్లేయర్లను భర్తీ చేయలేక సతమతమవుతున్నాయి ఫ్రాంచైజీలు. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఆర్సీబీ కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతోంది. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ లుంగి ఎంగిడీ డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో మే 26న స్వదేశానికి పయనమవుతున్నాడు. ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచులకు అతడు దూరమవుతున్నాడు. దీంతో ఎంగిడి స్థానంలో 6 అడుగుల 8 అంగుళాల పేసర్‌ను తీసుకొస్తోంది బెంగళూరు. మరి.. ఎవరా బౌలర్ అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ మ్యాచే లాస్ట్!
లుంగి ఎంగిడి స్థానంలో జింబాబ్వేకు చెందిన పొడగరి పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీని రీప్లేస్ చేసింది ఆర్సీబీ. ఈ స్పీడ్‌స్టర్‌ను తమ టీమ్‌లోకి తీసుకున్నట్లు ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఎంగిడీకి తాత్కాలిక భర్తీగా ముజర్బానీని తీసుకుంటున్నామని వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సన్నాహకాల నేపథ్యంలో మే 26న ఎంగిడి సౌతాఫ్రికాకు వెళ్లిపోతాడని తెలిపింది. అయితే మే 23న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో లుంగి ఎంగిడి బరిలోకి దిగుతాడని, ఈ సీజన్‌లో అతడికి ఇదే ఆఖరు మ్యాచ్ కానుందని స్పష్టం చేసింది. కాగా, ఆర్సీబీకి ఎంపికైన ముజర్బానీ భారత్‌కు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో మే 25 వరకు అతడు అక్కడే ఉండనున్నాడు. మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరుకు ముజర్బానీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసిరే ఈ జింబాబ్వే స్టార్.. తన ఎత్తుతోనూ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తుంటాడు. ఇతడు గానీ రాణిస్తే ఆర్సీబీకి బిగ్ ప్లస్ అయ్యే చాన్సులు ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఒక్కరు గెలిస్తే ముగ్గురు ముందుకెళ్లారు
వాళ్లకు పెయిడ్ ఫ్యాన్స్ ఉన్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి