Prasidh Krishna: వాటే బాల్.. ప్రసిద్ధ్ దెబ్బకు బిత్తరపోయిన ఇంగ్లండ్ స్టార్!
ABN , Publish Date - Jun 24 , 2025 | 09:22 PM
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టాడు. లీడ్స్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతులతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు.

లీడ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడుతున్న ఇంగ్లండ్ జోరుకు బ్రేకులు వేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. మంచి పేస్, లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. చెలరేగి ఆడుతున్న ఓపెనర్ జాక్ క్రాలే (65)తో పాటు ప్రమాదకర బ్యాటర్ ఓలీ పోప్ (8)ను ఔట్ చేశాడు ప్రసిద్ధ్. 8 బంతుల వ్యవధిలో ఇద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌కు దారి చూపించాడు. పోప్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్‌లో పడిన బంతి అనూహ్యంగా లోపలకు దూసుకొచ్చింది. బాల్ అంత స్వింగ్ అవుతుందని ఊహించని పోప్.. దాన్ని డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో నిరాశతో క్రీజును వీడాడు పోప్.
వాటే డెలివరీ..
పెద్దగా పేస్ లేకున్నా తెలివిగా బంతిని స్వింగ్ చేస్తూ పోప్‌ను బుట్టలో వేసుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. దీంతో అలా ఎలా ఔట్ అయ్యానా అంటూ బిత్తరపోయాడు ఇంగ్లండ్ స్టార్. షాక్‌కు గురైన అతడు కొద్దిసేపు అలాగే క్రీజులో ఉండిపోయాడు. ఆ తర్వాత వికెట్ల వైపు చూస్తూ పెవిలియన్ దిశగా నడక సాగించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. వాటే బాల్, ప్రసిద్ధ్ దెబ్బకు పోప్ పిచ్చోడైపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 269 పరుగులతో ఉంది. జో రూట్ (14 నాటౌట్)తో పాటు బెన్ స్టోక్స్ (13 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 37.3 ఓవర్లలో 102 పరుగులు కావాలి. అదే భారత్ నెగ్గాలంటే ఇంకో 6 వికెట్లు తీయాలి. స్టోక్స్-రూట్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గుతుంది. మరి.. మన బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి