Share News

India Tour Of Bangladesh: బీసీసీఐకి కేంద్రం నో.. ఇక ఆ సిరీస్ గురించి మర్చిపోవాల్సిందే!

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:07 PM

బీసీసీఐ రిక్వెస్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పిందని తెలుస్తోంది. ఇక, ఆ సిరీస్ గురించి మర్చిపోవాల్సిందేనని వినిపిస్తోంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

India Tour Of Bangladesh: బీసీసీఐకి కేంద్రం నో.. ఇక ఆ సిరీస్ గురించి మర్చిపోవాల్సిందే!
IND vs BAN Series

టెస్టులకు గుడ్‌బై చెప్పేసిన దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తిరిగి బ్లూ జెర్సీలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వీళ్లు దుమ్మురేపుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్టులో జరిగే ఇండో-బంగ్లా సిరీస్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో పర్యటించడానికి మోదీ సర్కారు నో చెప్పిందని సమాచారం.


సేఫ్టీనే ముఖ్యం..

బంగ్లాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది భారత్. ఆగస్ట్ 17 నుంచి జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పక ఆడతారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, స్థానిక సర్కారు సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉండటంతో అక్కడికి టీమిండియాను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పిందని తెలుస్తోంది. ప్లేయర్ల సేఫ్టీ విషయంలో రాజీ పడబోమని కేంద్రం స్పష్టం చేసిందట. దీంతో ఈ సిరీస్‌లను వాయిదా వేస్తారా? లేదా రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచుల మాదిరిగా తటస్థ వేదికల్లో నిర్వహించే దిశగా ఆలోచనలు చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు.

ind vs ban


గట్టి షాక్..

భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌ల ప్లానింగ్‌లో బిజీగా ఉన్న బంగ్లా బోర్డుకు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. ఈ సిరీస్‌లతో మీడియా హక్కుల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించాలని బీసీబీ అనుకుంది. అందుకు తగ్గట్లే జులై 10వ తేదీన బిడ్డింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే మోదీ సర్కారు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీసీసీఐ ఈ టూర్‌ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తుండటంతో మీడియా హక్కుల అమ్మకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది బంగ్లా బోర్డు.


ఇవీ చదవండి:

స్టోక్స్ గాలి తీసేసిన జడేజా

సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్

కార్ల్‌సన్‌కు గుకేష్‌ షాక్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 12:15 PM