Share News

Washington Sundar On England: ఇంగ్లండ్ మైండ్‌గేమ్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన సుందర్!

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:38 PM

ఇంగ్లండ్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. స్టోక్స్ సేనను మళ్లీ నోరెత్తకుండా చేశాడు.

Washington Sundar On England: ఇంగ్లండ్ మైండ్‌గేమ్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన సుందర్!
Washington Sundar

లార్డ్స్ టెస్ట్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. అటు ఇంగ్లండ్, ఇటు భారత్ ఢీ అంటే ఢీ అంటుండటంతో నాలుగు రోజుల ఆట టగ్ ఆఫ్ వార్‌లా సాగింది. ఐదో రోజు మరో 135 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. అదే ఆతిథ్య జట్టు నెగ్గాలంటే 6 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో ప్రస్తుతం తమదే కాస్త పైచేయి ఉండటంతో స్టోక్స్ సేన ఓవరాక్షన్ చేస్తోంది. మన బ్యాటర్లను చూస్తూ చప్పట్లు కొడుతూ కవ్విస్తున్నారు ఇంగ్లీష్ ప్లేయర్లు. తొలి గంటలోనే ఆలౌట్ చేసేస్తామంటూ ఆ టీమ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ అంశంపై భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..


గెలుపు మనదే..

రెండో ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు ఔట్ అయినా.. టీమిండియాలో ఇంకా బలమైన బ్యాటింగ్ లైనప్ మిగిలే ఉందన్నాడు సుందర్. లార్డ్స్‌లో గెలిచి తీరుతామంటూ ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేశాడు. తమ విజయాన్ని ఆపలేరని చెప్పాడు. ‘మనం అనుకున్నట్లే జరగాలని అనుకుంటాం. ప్రతి రోజూ చాలా విషయాల్లో ఇలాగే కోరుకుంటాం. ఈ మ్యాచ్ ఐదో రోజు సానుకూల దృక్పథంతో ఆటను మొదలుపెడతాం. మా లైనప్‌లో ఇంకా బలమైన బ్యాటర్లు ఉన్నారు. జట్టు విజయం కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధం. లార్డ్స్‌లో గెలిచామనే ఫీలింగ్ అద్భుతంగా అనిపిస్తుంది. మేం ఈజీగా నెగ్గుతామని భావిస్తున్నా’ అని సుందర్ స్పష్టం చేశాడు.


ముందే ప్లానింగ్..

నాలుగో రోజు ఆటలో 4 వికెట్లు పడగొట్టడం బౌలర్‌గా తనకు బెస్ట్ డే అని సుందర్ చెప్పుకొచ్చాడు. విదేశాల్లో రాణిస్తే ఆ ఫీలింగే వేరు అని.. చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందన్నాడు. మ్యాచ్‌లో ఎలా బౌలింగ్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేశామని తెలిపాడు. వికెట్లు తీయడం కోసం తన బౌలింగ్‌లో స్వల్ప మార్పులు చేసుకొని ప్రయత్నించానని.. అది భలేగా వర్కౌట్ అయిందన్నాడు భారత స్పిన్నర్. ఐదో రోజు బ్యాటింగ్ చాలెంజ్‌కు తాను సిద్ధంగా ఉన్నానని.. విజయం కోసం పోరాడుతానని సుందర్ పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

సిరాజ్‌కు ఐసీసీ షాక్!

పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం..

రాహుల్‌ను రెచ్చగొడుతున్నారు..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 02:41 PM