Share News

Team India: టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్.. సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్!

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:19 AM

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

Team India: టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్.. సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్!
India vs England

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.


దూకుడు మంత్రంతో..

ఇంగ్లండ్ పిచ్‌లపై వికెట్లు తీయాలంటే అటాకింగ్ అప్రోచ్‌తో ముందుకెళ్లాలని పీటర్సన్ సూచించాడని కుల్దీప్ తెలిపాడు. ఫీల్డ్ పొజిషన్స్ దగ్గర నుంచి బంతులు సంధించడం వరకు అన్నింటా దూకుడుగా ఉంటే సత్ఫలితాలు వస్తాయని చెప్పాడని పేర్కొన్నాడు. బ్యాటర్లను ఎలా ఔట్ చేయాలనే దాని మీదే దృష్టి పెట్టాలని సజెషన్ ఇచ్చాడని తెలిపాడు కుల్దీప్. దీంతో సొంత జట్టుకు వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగా పీటర్సన్ వ్యవహరిస్తున్నాడని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పీటర్సన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అని, కుల్దీప్ రాణించాలనే ఉద్దేశంతోనే అతడు సలహా ఇచ్చాడని చెబుతున్నారు. కాగా, లీడ్స్ టెస్ట్‌లో ఆడని కుల్దీప్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

6 నెలలు ఒక్క మాట అనలేదు

చరిత్ర సృష్టించిన డుప్లెసిస్

అప్పుడు గుండె ఆగినంత పనైంది

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 11:26 AM