GT vs DC Toss: టాస్ నెగ్గిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:01 PM
Today IPL Match: గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గింది గుజరాత్. ఆ టీమ్ ఏం ఎంచుకుందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఇవాళ పెద్ద కుదుపే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో నెగ్గిన టీమ్ తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే చాన్స్ ఉంది. టాప్ ప్లేస్ కూడా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. ట్రికీ పిచ్‌పై మంచి టార్గెట్ సెట్ చేస్తే గానీ గెలవడం కష్టమే. ఎందుకంటే ఈ స్లో వికెట్‌పై పరుగులు చేయడం చాలా కష్టం. కాబట్టి నింపాదిగా ఆడుతూ చివర్లో షాట్లకు దిగడం బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
ప్లేయింగ్ 11లో చేంజెస్ ఇవే..
అహ్మదాబాద్ పిచ్ గుజరాత్‌కు కొట్టిన పిండి. వాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ లైనప్స్‌కు అది బాగా సెట్ అవుతుంది. కాబట్టి డీసీ తమ బెస్ట్ బయటకు తీస్తే గానీ గెలవడం కష్టమే. రెండు జట్లు భీకర ఫామ్‌లో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఆఖరు వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగడం ఖాయం. కాగా, అటు డీసీ, ఇటు జీటీ ఇరు జట్లూ ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. డీసీ కరుణ్ నాయర్‌ను నేరుగా తుదిజట్టులోకి తీసుకుంది. అటు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చోటు ఇచ్చింది జీటీ మేనేజ్‌మెంట్. ఇవే కీలక మార్పులు.
ఇవీ చదవండి:
వాంఖడేలో స్టాండ్..అరుదైన గౌరవం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి