Share News

Sports: పాక్ కెప్టెన్ ఒళ్లు బలిసిన వ్యాఖ్యలు.. లెజెండ్ అని చూడకుండా..

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:57 PM

Sunil Gavaskar: ఎప్పుడూ టీమిండియా మీద పడి ఏడ్చే పాకిస్థాన్.. మరోమారు విద్వేషం వెళ్లగక్కింది. ఏకంగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌పై దుందుడుకు వ్యాఖ్యలు చేసింది.

Sports: పాక్ కెప్టెన్ ఒళ్లు బలిసిన వ్యాఖ్యలు.. లెజెండ్ అని చూడకుండా..
ICC Champions Trophy 2025

భారత్ పేరు చెబితే భగ్గుమనే పాకిస్థాన్.. ఎప్పుడూ మన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. టీమిండియా ఏం చేసినా విమర్శలు చేయడం వాళ్లకు పరిపాటిగా మారింది. భారత జట్టుతో పాటు ఆటగాళ్లు, కామెంటేటర్లు.. ఆఖరికి సీనియర్ క్రికెటర్లను కూడా పాక్ వదలడం లేదు. తాజాగా లెజెండ్ సునీల్ గవాస్కర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగాడో పాక్ మాజీ కెప్టెన్. గవాస్కర్‌పై అతడు ఒళ్లుబలిసే వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదం గురించి మరింతగా తెలుసుకుందాం..


మీ వల్ల కాదు

చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ వరుస ఓటములతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. భారత్‌తో పాటు ఇతర జట్ల చేతుల్లో చిత్తుగా ఓడింది. దీంతో గవాస్కర్ ఆ టీమ్ పరువు తీశాడు. ఇండియా-బీ జట్టు మీద కూడా రిజ్వాన్ సేన గెలవలేదన్నాడు. ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సీరియస్ అయ్యాడు. గవాస్కర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


ఊరుకునేది లేదు

‘భారత్ బాగా ఆడింది. వాళ్లు మ్యాచ్ గెలిచారు. అంతవరకు ఓకే. కానీ గవాస్కర్ అలా మాట్లాడాల్సింది కాదు. ఆయన ఒకసారి రికార్డులు చూసుకోవాలి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకుండా తప్పించుకునేందుకు ఆయన షార్జాకు పారిపోవడం మర్చిపోయారా.. గవాస్కర్ మా కంటే సీనియర్. కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం. అంతమాత్రాన ఇలా మాట్లాడితే ఊరుకోం’ అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ విన్న నెటిజన్స్.. గవాస్కర్‌ను అన్ని మాటలు అంటావా అని ఇంజమామ్ మీద సీరియస్ అవుతున్నారు. భారత బీ టీమ్ కాదు, సీ టీమ్ చేతుల్లోనూ పాక్ ఓడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని సూచిస్తున్నారు. గవాస్కర్ ముందు మీరెంత అని దుయ్యబడుతున్నారు.


ఇవీ చదవండి:

ఐపీఎల్‌కు కేంద్రం షాక్

గజినీలా మారిన రోహిత్.. కప్పు మర్చిపోయి..

రోహిత్‌కు అనుష్క హగ్.. రితికా ముందే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2025 | 03:15 PM