DC vs RR Predicted 11: డీసీ వర్సెస్ ఆర్ఆర్.. కొదమ సింహాల కొట్లాట.. ప్లేయింగ్ 11 ఇదే..
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:45 PM
Today IPL Match: ఢిల్లీ క్యాపిటల్స్ మరో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతోంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొడుతోంది అక్షర్ సేన. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు గత మ్యాచ్‌లో బ్రేక్ వేసింది ముంబై ఇండియన్స్. సొంత మైదానంలో పరాభవంతో షాక్‌కు గురైన డీసీ.. ఇప్పుడు గాయపడ్డ సింహంలా కసి మీద ఉంది. నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు అక్షర్ సేన సిద్ధమవుతోంది. పాయింట్స్ టేబుల్‌లో తిరిగి టాప్‌కు చేరుకోవడంతో పాటు హోం గ్రౌండ్‌ను కంచుకోటగా మార్చుకోవాలని అక్షర్ సేన భావిస్తోంది. అటు వరుస పరాజయాలతో డీలాపడిన సంజూ సేన.. ఈ మ్యాచ్‌తోనైనా గాడిన పడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
మార్పులు ఖాయం
అటు ఢిల్లీ క్యాపిటల్స్, ఇటు రాజస్థాన్ రాయల్స్ పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్స్‌తో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. డీసీ తుదిజట్టులో ఒక మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అటు రాజస్థాన్ టీమ్‌లోనూ ఒక చేంజ్ పక్కా అని తెలుస్తోంది. మరి.. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరు వస్తారనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్.
ఇంపాక్ట్ ప్లేయర్: కరుణ్ నాయర్/మోహిత్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ (అంచనా): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, శుభం దూబె, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష తీక్షణ, ఆకాశ్ మధ్వాల్.
ఇంపాక్ట్ ప్లేయర్: శుభమ్ దూబె/సందీప్ శర్మ.
ఇవీ చదవండి:
ఐపీఎల్ డాట్ డాల్స్.. అడవినే సృష్టించొచ్చు
ఈ బుడతడి తండ్రి.. బ్యాటర్లకు మొగుడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి