Mitchell Starc: స్టార్క్ మోసం చేశాడా.. మరీ ఇంతగా అవమానించాలా..
ABN , Publish Date - Apr 17 , 2025 | 02:35 PM
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైల్టీ స్టేడియం వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే క్రంచ్ సిచ్యువేషన్స్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రాణించడంతో డీసీ విజయఢంకా మోగించింది.

ఐపీఎల్-2025లో మొదటి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో 2 బంతులు ఉండగానే విజయం సాధించింది డీసీ. ఈ గెలుపుతో 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌కు దూసుకెళ్లింది అక్షర్ సేన. ఈ విక్టరీలో కీలకపాత్ర పోషించిన డీసీ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే స్టార్క్ మోసం చేశాడంటూ అతడ్ని అవమానిస్తూ నెట్టింట పలు పోస్టులు పెట్టడం, యాంటీ ఫ్యాన్స్ అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం హాట్ టాపిక్‌గా మారింది. మరి.. ఈ తోపు పేసర్ నిజంగానే తప్పు చేశాడా.. అసలేం జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
నిజమెంత..
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన స్టార్క్ 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఒక దశలో శాంసన్ సేనదే విజయమని అంతా డిసైడ్ అయ్యారు. డీసీ చేతి నుంచి మ్యాచ్ చేజారిందని భావించారు. అయితే 18తో పాటు 20వ ఓవర్ వేసిన స్టార్క్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చేశాడు. చివరి 12 బంతుల్లో 11 బంతుల్ని అతడు యార్కర్లుగా మలిచాడు. జోరు మీదున్న నితీష్ రాణాను స్టన్నింగ్ రివర్స్ స్వింగింగ్ యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. సూపర్ ఓవర్‌లోనూ 11 పరుగులు మాత్రమే ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే అతడు వేసిన రివర్స్ స్వింగ్ యార్కర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సలైవా (ఉమ్ము)ను వాడి స్టార్క్ ఆ బాల్‌ను స్వింగ్ చేశాడని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు.
రూల్స్‌కు లోబడే..
సలైవా వాడకపోతే బాల్ అంతగా స్వింగ్ అయ్యేది కాదని నెటిజన్స్ చెబుతున్నారు. నితీష్ రాణా ఔట్ కాకపోయి ఉంటే రాజస్థాన్ ఈజీగా గెలిచేదని.. స్టార్క్ మోసం చేశాడంటూ అతడ్ని అవమానిస్తున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే.. ఈ ఐపీఎల్‌లో సలైవా వాడొచ్చని లీగ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ ప్రకటించింది. ఉమ్ము వాడకంపై కరోనా టైమ్‌లో బ్యాన్ చేసిన బోర్డు.. ఇప్పుడు దాన్ని ఎత్తేసింది. దీంతో అన్ని జట్లు బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ కోసం ఉమ్మును వాడుతూ బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటప్పుడు స్టార్క్ సలైవా వాడి ఉంటే అది ముమ్మాటికీ రూల్స్‌కు లోబడి చేసినదే. సరే సలైవా ఉపయోగించాడని అంటున్నారు.. మరి, అతడు చివర్లో వేసిన 12 బంతుల్లో 11 అయితే గురిచూసి సంధించిన యార్కర్లు. ఈ ఏజ్‌లోనూ 145 కిలోమీటర్ల పేస్‌తో స్టన్నింగ్ యార్కర్స్ వేయడం అంత ఈజీనా.. అలాంటోడ్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా విమర్శించడం ఎంతవరకు సబబు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, నిన్నటి మ్యాచ్‌లో తాను సలైవా వాడలేదంటూ క్లారిటీ ఇచ్చాడు స్టార్క్.
ఇవీ చదవండి:
నాయర్.. దిలీప్‌కు ఊహించని షాక్
‘బ్యాట్’ పరీక్షలో నరైన్, నోకియా విఫలం
బీసీసీఐ అంబుడ్స్‌మన్ కీలక ఉత్తర్వులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి