Share News

DC vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. డీసీకి బంపర్ చాన్స్

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:06 PM

Indian Premier League: ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్‌కు దిగుతారో ఇప్పుడు చూద్దాం..

DC vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. డీసీకి బంపర్ చాన్స్
DC vs RCB Toss

ప్లేఆఫ్స్ బెర్త్‌లు డిసైడ్ చేసే మరో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టాప్-2లో ప్లేస్‌ కోసం పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫైట్ స్టార్ట్ అయింది. టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో డీసీ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో పాటు బౌండరీ సైజ్ చిన్నగా ఉండటం, ఇరు జట్ల నిండా భారీ హిట్టర్లు ఉన్నందున పరుగుల వర్షం కురవడం ఖాయం. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోవడం మంచిదే. ఎందుకంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో చేజింగ్ చేయడం ఈజీ. అయితే ఇక్కడే ఓ చిక్కు ఉంది.


వాళ్లదే విక్టరీ

సొంత గ్రౌండ్‌లో గత మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టింది డీసీ. 188 పరుగుల స్కోరును రాజస్థాన్ రాయల్స్ చేజ్ చేయకుండా కాపాడుకుంది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది డీసీ. హోమ్ గ్రౌండ్ కావడం, కండీషన్స్‌కు అలవాటు పడటం, లాస్ట్ మ్యాచ్‌లో అక్కడ గెలుపు రుచి చూడటం అక్షర్ సేనకు కలిసొచ్చే అంశాలు. టార్గెట్‌ను డిఫెండ్ చేయడం తెలుసు కాబట్టి లోకల్ బాయ్ కోహ్లీ వికెట్ తీస్తే ఆ టీమ్‌కు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి టాస్ నెగ్గిన ఆర్సీబీతో పాటు డీసీకి కూడా గెలిచే అవకాశాలు గట్టినే ఉన్నాయి. అయితే ఎవరు ప్రెజర్‌ను తట్టుకొని లాస్ట్ వరకు నిలబడి ఫైట్ చేస్తారో వాళ్లదే విజయం.


ఇవీ చదవండి:

రాక్షసుడు వచ్చేస్తున్నాడు

రికల్టన్ ఊచకోత.. తాటతీశాడు

ఈ పగ ఎప్పటికీ చల్లారదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 27 , 2025 | 07:22 PM