KL Rahul Record: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. రోహిత్-కోహ్లీని మించిపోయాడు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:27 PM
Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ వల్ల కానిది అతడు సాధించాడు. ఇంతకీ కేఎల్ అందుకున్న ఆ ఘనత ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతడో అరుదైన ఘనతను అందుకున్నాడు. జీటీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు రాహుల్. కళ్లుచెదిరే రీతిలో బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇది ఐపీఎల్‌లో రాహుల్‌కు 200వ సిక్స్ కావడం విశేషం. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో అత్యంత వేగంగా 200 సిక్సులు బాదిన బ్యాటర్‌గా కేఎల్ క్రేజీ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు.
సంజూ-ధోనీని దాటేశాడు
కేఎల్ రాహుల్‌కు 200 సిక్సుల మైలురాయిని చేరుకునేందుకు 129 ఇన్నింగ్స్‌లు పట్టింది. రాహుల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో సంజూ శాంసన్ (159 ఇన్నింగ్స్‌లు), మహేంద్ర సింగ్ ధోని (165 ఇన్నింగ్స్‌లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఈ క్లబ్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే.. కరీబియన్ విధ్వంసకారుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (69 ఇన్నింగ్స్‌లు) టాప్‌లో ఉన్నాడు. ఆండ్రీ రస్సెల్ (97 ఇన్నింగ్స్‌లు) సెకండ్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతున్నాడు. తర్వాతి స్థానంలో రాహుల్ ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆడిన ప్రతి చోట అదరగొడుతున్న కేఎల్ అదే ఫామ్‌ను ఐపీఎల్ తాజా సీజన్‌లోనూ కొనసాగిస్తున్నాడు. అతడు బాదుతున్న పరుగులు, డీసీ విజయాలతో పాటు ఇలాంటి ఆల్‌టైమ్ రికార్డులు కూడా దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. కాగా, 200 సిక్సుల క్లబ్‌లో రాహుల్ అందరికంటే ముందుండటం, రోహిత్-కోహ్లీ లాంటి స్టార్లను దాటేయడంతో కేఎల్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇవీ చదవండి:
వాంఖడేలో స్టాండ్..అరుదైన గౌరవం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి