Share News

Anderson Philips Catch: వీడు మనిషా.. పక్షా? ఇలా పట్టేశాడేంట్రా బాబు!

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:08 PM

క్రికెట్‌లో ఎన్నో బెస్ట్ క్యాచులు చూసుంటారు. కొన్ని గొప్ప క్యాచులు కూడా రిపీటెడ్‌గా చూసుంటారు. అలాంటి కోవలో చేరే క్యాచే ఇది. మనిషా.. పక్షా.. అనేలా ఆశ్చర్యపరుస్తూ బంతిని గాల్లో ఎగురుతూ పట్టేశాడో ఫీల్డర్.

Anderson Philips Catch: వీడు మనిషా.. పక్షా? ఇలా పట్టేశాడేంట్రా బాబు!
Anderson Philips

ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. కంగారూ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ (20)ను ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపించాడు అండర్సన్ ఫిలిప్స్. జస్టిన్ గ్రీవ్స్ బౌలింగ్‌లో గుడ్ లెంగ్త్‌లో పడిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు హెడ్. అయితే బాల్ కాస్త ఎక్కువగా బౌన్స్ అవడంతో షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మిడాఫ్ దిశగా గాల్లోకి లేచింది బంతి. అంతే దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అండర్సన్ ఫిలిప్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు.


గాల్లో ఎగురుతూ..

కుడి చేతి వైపు గాల్లో పక్షిలా ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు అండర్సన్ ఫిలిప్స్. బంతిని అందుకున్న సమయంలో అతడి శరీరం మొత్తం గాల్లోనే ఉండటం గమనార్హం. బాల్‌ పట్టాక శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకొని లేచి సెలబ్రేట్ చేసుకున్నాడు ఫిలిప్స్. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ట్రావిస్ హెడ్‌తో పాటు విండీస్ ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు. వాటే క్యాచ్ అంటూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకొని అండర్సన్‌తో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్లయింగ్ క్యాచెస్ చూడలేదని.. ఇది బెస్ట్ క్యాచ్ అంటూ నెటిజన్స్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌట్ అయింది ఆసీస్. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.


ఇవీ చదవండి:

రోహిత్ రికార్డుకు పంత్ ఎసరు!

ఒక్క ఓవర్‌కే భయపడతారా?

మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 05:10 PM