Share News

Ajinkya Rahane: ప్రైజ్ ట్యాగ్‌పై రహానె సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల నోళ్లు మూయించాడు!

ABN , Publish Date - May 26 , 2025 | 04:29 PM

ఐపీఎల్‌కు సంబంధించి వివాదాస్పద అంశాల్లో ప్రైజ్ ట్యాగ్ ఒకటి. ప్రతి సీజన్‌లో దీని గురించి చర్చలు జరుగుతుంటాయి. ఈసారి కూడా పలువురు ఆటగాళ్ల ప్రైజ్ ట్యాగ్‌పై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ సారథి అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడేం అన్నాడంటే..

Ajinkya Rahane: ప్రైజ్ ట్యాగ్‌పై రహానె సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల నోళ్లు మూయించాడు!
Ajinkya Rahane

స్టార్ ప్లేయర్ల కోసం వేలంలో పోటీపడుతుంటాయి ఫ్రాంచైజీలు. ఫలానా ఆటగాడు తమ జట్టులోకి వస్తే ట్రోఫీ పక్కా కొడతామనే నమ్మకం ఉంటే వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తాయి. కోట్ల వర్షం కురిపించి ప్లేయర్లను సొంతం చేసుకుంటాయి. అయితే ఇలా ఆక్షన్‌లో అమ్ముడైన ఆటగాళ్లంతా బరిలోకి దిగితే రాణిస్తారని చెప్పలేం. ఫామ్‌తో పాటు ఒత్తిడిని తట్టుకొని నిలబడే వాళ్లు రాణించగలరు. ఇలాంటి వాళ్లను ఫ్రాంచైజీలు నెక్స్ట్ సీజన్‌కూ కొనసాగిస్తాయి. అదే అనుకున్నంతగా రాణించకపోతే వదులుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలా ప్రతి ఐపీఎల్‌లో ప్రైజ్ ట్యాగ్ అనేది చర్చనీయాంశంగా మారుతూ వస్తోంది. దీనిపై కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన మీద ధర ఎలాంటి ప్రభావం చూపదన్నాడు. అతడు ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


రెట్టింపు కష్టపడాలా..

కోట్లు ఇచ్చినంత మాత్రాన రెట్టింపు కష్టపడాలని అనడం కరెక్ట్ కాదన్నాడు రహానె. ధరను బట్టి ఆడాలా అంటూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ‘రూ.20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం అందుకుంటున్నామని రెట్టింపు కష్టపడమంటే ఎలా.. కోటి, 2 కోట్లు, 3 కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లు మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోరు కదా.. బరిలోకి దిగాక ఏ ప్లేయర్‌ అయినా ప్రవర్తనలో తేడా ఉండదు. జట్టు కోసం వంద శాతం కమిట్‌మెంట్‌తో ఆడాల్సిందే. అదే ఇక్కడ చాలా ముఖ్యం. వెంకటేశ్ అయ్యర్ కూడా తన ఆట మీద ఇదే విధంగా దృష్టి పెట్టాడు. తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఊహించిన విధంగా ఆడలేకపోయాడు. ప్రైజ్ ట్యాగ్‌ గురించి అతడు ఆలోచిస్తాడని అనుకోవట్లేదు. అతడి వైఫల్యానికి ప్రైజ్ ట్యాగ్‌ కారణం కాదు’ అని రహానె స్పష్టం చేశాడు.

venkatesh-iyer.jpg


సంబంధమే లేదు!

ఈ సీజన్‌కు ముందు జరిగిన మెగా ఆక్షన్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది కేకేఆర్. అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పగించింది. కానీ అయ్యర్ రాణించలేకపోయాడు. సీజన్ మొత్తం మీద 20.28 సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఫ్రాంచైజీ చెల్లించిన దానికి, అతడి ఆటతీరుకు సంబంధమే లేదని.. కేకేఆర్‌ను వెంకీ అయ్యర్ ముంచేశాడంటూ సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వస్తున్నాయి. దీనికి సమాధానంగానే రహానె పైవిధంగా స్పందించాడు. అయ్యర్ చాలా ఫోకస్ చేశాడని, అతడి ప్రవర్తన అద్భుతమని మెచ్చుకున్నాడు. కానీ అతడికి ఏదీ కలసి రాలేదన్నాడు. ఎక్కువ డబ్బులు ఇచ్చినంత మాత్రాన రెట్టింపు కష్టపడాలని అనడం సరికాదన్నాడు రహానె.


ఇవీ చదవండి:

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

ఇండియా మ్యాచులు.. ఫ్రీగా చూసేయండిలా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 04:34 PM