Rashid Khan Dream: తుపాకుల రాజ్యంలో క్రికెట్.. రషీద్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!
ABN , Publish Date - Jul 05 , 2025 | 02:33 PM
ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకునే లోపు ఆ కోరిక నెరవేరితే చాలు అని అనుకుంటున్నానని చెప్పాడు.

రషీద్ ఖాన్.. ప్రపంచ క్రికెట్‌లో ఇతడో సంచలనం. ఆఫ్ఘానిస్థాన్ అనే చిన్న దేశం నుంచి వచ్చి తన స్పిన్ బౌలింగ్‌తో వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తున్నాడీ బౌలర్. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని లీగ్స్‌లో ఆడుతూ అశేష అభిమానులను సంపాదించుకున్నాడీ స్పిన్నర్. వికెట్ల మీద వికెట్లు తీస్తూ తోపు బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. డబ్బుకు డబ్బు, ఫుల్ క్రేజ్, గొప్ప విజయాలు.. ఇలా కెరీర్‌లో అన్నీ చూశాడు రషీద్. అయినా అతడికి ఓ తీరని కోరిక ఉండిపోయిందట. రిటైర్ అయ్యే లోపు అది నెరవేరితే చాలు అని అంటున్నాడు. మరి.. రషీద్ డ్రీమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
అది జరిగి తీరాలి..
‘ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో ఆఫ్ఘానిస్థాన్ సిరీస్‌లు చేర్చడం శుభపరిణామం. కానీ మా దేశంలో క్రికెట్ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. చాన్నాళ్లుగా ఆఫ్ఘాన్‌లో ఎఫ్‌టీపీ షెడ్యూల్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా విదేశీ జట్లు ఇక్కడ ఆడలేదు. కానీ ఈసారి అది నిజం అవుతుందని భావిస్తున్నా. ఇది ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్‌కు చాలా మంచిది. ఆఫ్ఘాన్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ జరగాలనేది నా చిరకాల కోరిక. నేను ఆట నుంచి తప్పుకునే లోపు ఇది జరుగుతుందని నమ్ముతున్నా’ అని రషీద్ చెప్పుకొచ్చాడు.
కష్టమే..
సొంత గడ్డపై అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే క్షణాల కోసం ఎదురు చూస్తున్నానని రషీద్ పేర్కొన్నాడు. అది భవిష్యత్తులో నిజం అవుతుందని భావిస్తున్నానని తెలిపాడు. కాగా, ఎఫ్‌టీపీలో భాగంగా ఆఫ్ఘాన్‌లో వెస్టిండీస్, న్యూజిలాండ్ టూర్లను ఖరారు చేసింది ఐసీసీ. అయితే భద్రతా కారణాల వల్ల ఆఫ్ఘానిస్థాన్‌లో ఇంటర్నేషనల్ మ్యాచులు జరగడం లేదు. ఏ టీమ్ కూడా అక్కడికి వెళ్లడం లేదు. దుబాయ్ లేదా భారత్ లాంటి తటస్థ వేదికలపై ఇతర జట్లతో సిరీస్‌లు ఆడుతూ వస్తోంది ఆఫ్ఘాన్. ఈ నేపథ్యంలో తాను రిటైర్ అయ్యే లోపు సొంతగడ్డపై ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా ఆడాలని అనుకుంటున్నట్లు రషీద్ చెప్పాడు. అయితే నిత్యం తుపాకుల మోతతో దద్దరిల్లే ఆఫ్ఘాన్‌లో అది నెరవేరడం కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఆర్సీబీ స్టార్ సెన్సేషనల్ నాక్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి